Site icon NTV Telugu

Ukraine War: 477 డ్రోన్లు, 60 క్షిపణులు.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా…

Russia Ukraine

Russia Ukraine

Ukraine War: రష్యా ఉక్రెయిన్‌పై అతిపెద్ద వైమానిక దాడి ప్రారంభించింది. ఈ దాడుల్లో ఒక ఆరుగురు గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా మొత్తం 537 వైమానిక ఆయుధాలను ప్రయోగించింది. వీటిలో 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయి. అయితే, వీటిలో 249ని కూల్చేసినట్లు, మరికొన్నింటిని ఎలక్ట్రానిక్ జామ్ చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ప్రజల ప్రాణాలకు అవసరమయ్యే అన్నింటిని రష్యా టార్గెట్ చేస్తోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఎక్స్ పోస్టులో ఆరోపించారు.

Read Also: Alcohol Effects: జస్ట్ 21 రోజులు మద్యం మానేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తీవ్రస్థాయిలో జరిగిన దాడి తర్వాత ఇరు దేశాల మధ్య మూడేళ్ల యుద్ధ ముగింపు ప్రయత్నాల ఆశల్ని దెబ్బతీసింది. బాంబు దాడుల వల్ల ఇళ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తమ మూడవ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ని కోల్పోయినట్లు జెలెన్స్కీ చెప్పారు. భారీ దాడులు చేయగలిగతే సామర్థ్యం ఉన్నంత వరకు రష్యా ఆగదని ఆయన అన్నారు. గత వారంలో 114కి పైగా క్షిపణులు, 1270కి పైగా డ్రోన్లు, 1100 గ్లైడ్ బాంబులను ప్రయోగించినట్లు ఆరోపించారు. ప్రపంచం శాంతి కోసం పిలుపునిచ్చినప్పటికీ, యుద్ధం చేయాలని పుతిన్ భావిస్తున్నాడని జెలెన్స్కీ అన్నారు.

డ్రోన్లు, వివిధ రకాల క్షిపణులను పరిగణనలోకి తీసుకుంటే దేశంపై “అత్యంత భారీ వైమానిక దాడి” అని ఉక్రెయిన్ వైమానిక దళం కమ్యూనికేషన్స్ అధిపతి యూరి ఇహ్నాత్ అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు.దాడి సమయంలో డ్రోన్లు, బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులు సహా దాదాపు 500 రకాల వైమానిక ఆయుధాలను ఉపయోగించినట్లు ఉక్రేనియన్ సైన్యం తెలిపింది.

Exit mobile version