ఉక్రెయిన్ లో పరిస్థితులు దిగజారుతున్నాయి. రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లో దాడులు చేస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు మెడిసిన్ తో పాటు వివిధ కోర్సులను అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. సడెన్‌గా యుద్ధం రావడంతో యూనివర్శిటీల నుంచి విద్యార్థులను బయటకు పంపించేశారు. భారతీయ విద్యార్థులను సొంత దేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
Read: CM Jagan : ఏపీ ఆర్ధిక అభివృద్ధిలో విశాఖ నగరం కీలకపాత్ర పోషిస్తోంది
ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో బయటి దేశాల నుంచి ఏ విమానాలు ఉక్రెయిన్‌లోకి ఎంటర్ కావడం లేదు. రొమేనియా, హంగేరీ సరిహద్దుల నుంచి విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చేందుకు భారతీయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 40 మంది భారతీయ మెడికల్ విద్యార్థులు కీవ్ నుంచి నడుచుకుంటూ పోలెండ్ వైపు సాగిపోతున్నారు. కీవ్‌లో పరిస్థితులు అంతకంతకు మారిపోతుండటంతో వీలైనంత త్వరగా పోలెండ్ బోర్డర్‌కు చేరుకొని అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
