Site icon NTV Telugu

Earthquake: పాకిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.6 నమోదు

Earthquakebihar

Earthquakebihar

పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.6గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం… ఆదివారం సాయంత్రం 06:59 గంటలకు భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో ఈ భూకంపం సంబంధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు అందించలేదు.

ఇది కూడా చదవండి: Marco Rubio: బందీలను విడిపించడమే లక్ష్యం.. నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు.. గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

శనివారం కూడా భారత కాలమానం ప్రకారం 01:59 గంటలకు పాకిస్థాన్‌లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆదివారం సాయంత్రం మరొకసారి భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నివేదించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కరాచీలో దాదాపు 30 తేలికపాటి భూకంపాలు సంభవించాయి. ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నితీష్‌కుమార్‌ ఆరోగ్యంగా ఉన్నారో లేదో అనుమానం.. వీడియో విడుదల చేసిన తేజస్వి యాదవ్

ఇక ఆ మధ్య ఆప్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు పోయాయి. వేలాది మందికి గాయాలయ్యాయి. అర్థరాత్రి వచ్చిన భూకంపంతో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

 

Exit mobile version