NTV Telugu Site icon

Brazil Accident: బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి

Brazil

Brazil

Brazil Accident: బ్రెజిల్‌లోని మినాస్‌ జెరాయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 38 మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గెరైస్ రాష్ట్రంలోని హైవేపై శనివారం నాడు తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, సావోపోలో నగరం నుంచి వెళ్తున్న బస్సులో 45 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఈ క్రమంలో బస్సు టైరు ఒకటి ఊడిపోవడం వల్ల డ్రైవరు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వెళ్తున్న ట్రక్కును ఢీకొన్నాడు. దీంతో పాటు పెద్ద గ్రానైటు రాయిని సైతం బస్సును తాకినట్లు మరికొందరు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.

Read Also: Minister Payyavula Keshav: జీఎస్టీ కౌన్సిల్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు

ఇక, ఆ సమయంలో ముగ్గురు ప్రయాణికులతో అటువైపు వచ్చిన కారు సైతం బస్సును ఢీ కొట్టిన.. ఆ కారులో ఉన్నవారంతా క్షేమంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కాగా, కారులోని వారు గాయాలతో బయటపడ్డారని అగ్నిమాపక శాఖ సిబ్బంది చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక హస్పటల్ కి తరలించారు. అయితే, తమ సిబ్బంది సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారని అగ్నిమాపక విభాగం లెఫ్టినెంట్ అలెన్సో వెల్లడించారు.

Show comments