NTV Telugu Site icon

UNICEF: పిల్లలపై వలస సంక్షోభం.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే

Childrens

Childrens

ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షోభానికి గురువుతున్నారు. అనేక కారణాల వల్ల పిల్లల వలసలకు గురువుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే పిల్లల వలస పెరిగిందని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) శుక్రవారం  వెల్లడించింది. అనేక కారణాల వల్ల సొంత ప్రాంతాలను వదిలి ఇతర దేశాలకు పిల్లలు శరణార్థులుగా వెళ్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 36.5 మిలియన్ల పిల్లలు 2021 చివరి నాటికి ఘర్షణ, హింస ఇతర సంక్షోభాల కారణంగా సొంత ప్రాంతాలను వదిలి వెళ్లారు. దాదాపుగా 22.8 మిలియన్ల మంది అంతర్గత సంక్షోభం, హింస కారణంగా వలస వెళ్లారు. దీంతో పాటు వాతావరణం, పర్యావరణ పరిణామాలు, విపత్తుల కారణంగా పిల్లలు వరస సంక్షోభాన్ని ఎదుర్కొంటూ శరణార్థులుగా మారుతున్నాయి. తాజాగా 2022లో ఉక్రెయిన్- రష్యా పరిణామాలు కూడా పిల్లల వలసలకు కారణం అయింది. అయితే ఇది యూనిసెఫ్ నివేదికలో చేర్చ లేదు.

ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన హింస, దీర్ఘకాలిక సంఘర్షణ, రాజకీయ అస్థిరత కారణంగా చాలా మంది పిల్లలు మైగ్రేట్ అవుతున్నారు. సరిహద్దుల్లోని పాకిస్తాన్, తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్  వంటి దేశాలు శరణార్థి సంక్షోభానికి ప్రభావితం అవుతున్నాయి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యెమెన్ వంటి దేశాల్లో వాతావరణ మార్పులు, తీవ్రవాదం, విధ్వంసక పరిణామాలు పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.  శరణార్థి పిల్లల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రక్షణ వంటి సేవలు అవసరం అని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ అన్నారు. పిల్లలు వలస వెళ్లకుండా విద్య, రక్షణ ఇతర సేవలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనాథలైన పిల్లలు అక్రమ రవాణా, దోపిడి, హింసకు గురయ్యే ప్రమాదం ఉందని.. ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణాలో 28 శాతం పిల్లలే ఉంటున్నారని నివేదిక తెలిపింది.