NTV Telugu Site icon

China: చైనాలో అమానుష ఘటన.. కార్‌ ఢీకొట్టి 35 మంది మృతి..

China

China

China: చైనాలో దారుణ ఘటన జరిగింది. అమాయమైన ప్రజలపైకి కారుని పోనిచ్చి 35 మంది ప్రాణాలు తీశాడు. దక్షిణ చైనాలోని జూహై నగరంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందగా, 43 మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు మంగళవారం తెలిపారు. సోమవారం సాయంత్రం జరిగిన ఘటనలో, పోలీసులు ముందుగా ప్రజలు గాయపడ్డారని నివేదించారు. అయితే, ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో మంగళవారం మరణించిన వారి సంఖ్యను వెల్లడించారు.

Read Also: Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉండి ఇవి తిన్నారో.. ఇక దబిడి దిబిడే

జూహై స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన దుర్మార్గపు దాడిలో మరణించిన వారి సంఖ్య 35 అని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి 62 ఏళ్ల వ్యక్తి పాల్పడ్డాడు. అతడి ఇంటిపేరును ఫ్యాన్‌గా గుర్తించారు. గేటు బయట నుంచి చిన్న ఎస్‌యూవీ కార్‌ని నగరంలోని స్పోర్ట్ సెంటర్‌లోకి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఎక్సర్‌సైజ్ చేస్తున్న వ్యక్తులపైకి పోనిచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు తన గొంతు కోసుకున్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం అతడి మెడ, ఇతర శరీర భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో కోమాలో ఉన్నాడు, విచారించేందుకు సాధ్యపడలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ స్పందించారు. గాయపడిన వారికి అన్ని విధాల చికిత్స అందించాలని ఆదేశించాడరు. నేరస్తుడిని చట్టప్రకారం శిక్షించాలని కోరినట్లు అధికారిక జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

Show comments