NTV Telugu Site icon

Long Covid: కరోనా బాధితుల్లో తీవ్ర సమస్యలు..!

Long Covid

Long Covid

కరోనా వచ్చి పోయినవారిలో దీర్ఘకాలికంగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.. కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ సమయంలో లక్షలాది మంది ఆ మహమ్మారి బారినపడ్డారు.. కొంతమందిలో లక్షణాలు లేకుండా వైరస్‌ సోకడం.. తిరిగి కోలుకోవడం కూడా జరిగిపోయాయి.. వైరస్‌ సోకిందనే భయంతో ఎంతో మంది ప్రాణాలు కూడా విడిచారు. అయితే, కరోనా సోకిన వారిలో 30 శాతం మంది లాంగ్​కోవిడ్‌తో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది.. మొత్తం 1,038 మందిపై పరిశోధన నిర్వహించగా.. వారిలో 309 మందిలో లాంగ్‌ కోవిడ్‌ లక్షణాలు కనిపించాయని వెల్లడించారు.. ఇంకా కొందరిలో కొన్ని లక్షణాలు దీర్ఘకాలం పాటు వేధిస్తున్నట్లు ఆ అధ్యయనం తేల్చింది.

Read Also: KTR Tour: నేడు వరంగల్‌కు మంత్రి కేటీఆర్..

కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న తర్వాత వారిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దానిపై అమెరికా పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు.. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెల్స్‌ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాఇ.. కోవిడ్‌ సోకి ఆస్పత్రిలో చేరినవారితోపాటు మధుమేహం, అధిక బరువు ఉన్న వారిలో పోస్ట్‌ అక్యూట్‌ సీక్వెలే ఆఫ్‌ కొవిడ్‌గా (పీఏఎస్‌సీ)గా పిలిచే ‘లాంగ్‌ కోవిడ్‌’ ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఆ పరిశోధన గుర్తించింది.. కోవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నవారిలో అధికశాతం అలసట (31శాతం), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (15 శాతం) వంటి లక్షణాలు ఉన్నాయని.. దీర్ఘకాలం పాటు ఈ సమస్య వారిని వెంటాడినట్టు తేల్చారు.. ఇక వాసన గుర్తించలేని పరిస్థితి 16 శాతం మందిలో కనిపించందని పేర్కొన్నారు.. కాగా, కోవిడ్‌ తర్వాత ప్రభావాలను తెలుసుకోవడం కోసం అమెరికా పరిశోధకులు చేపట్టిన ఈ పరిశోధనలో మొత్తం 1,038 మంది పరిస్థితులను పరిశీలించారు.. వీరిలో 309 మందిలో లాంగ్‌ కోవిడ్‌ లక్షణాలను గుర్తించారు.