Site icon NTV Telugu

Iran: నకిలీ క్లినిక్ ముసుగులో మహిళలపై అత్యాచారం.. ముగ్గురికి ఉరిశిక్ష అమలు..

Iran

Iran

Iran: నకిలీ కాస్మెటిక్ సర్జరీ క్లినిక్ పేరుతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. మత్తు మందు ఇచ్చి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ముగ్గురిని ఇరాన్ మంగళవారం ఉరితీసింది. 2021 చివరిలో హార్మోజ్‌గాన్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో 12 లైంగిక వేధింపుల కేసుల్లో వారు కుట్ర పన్నారని అక్కడి న్యాయస్థానం నిర్ధారించింది. అనధికార బ్యూటీ సెలూన్ లో అనేక మంది మహిళపై అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులను ఈ రోజు ఉదయం అబ్బాస్ జైలులో ఉరి తీశారని హార్మోజ్‌గాన్ యొక్క ప్రధాన న్యాయమూర్తి మోజ్తాబా ఘహ్రామణి పేర్కొన్నారు.

Read Also: Afghanistan: నెలలోపు “బ్యూటీ సెలూన్స్” మూసేయాలి.. తాలిబాన్ల వార్నింగ్…

ఉరి తీయబడిన వారిలో ఒకరు మెడికల్ అసిస్టెంట్ కాగా.. ఇద్దరు నర్సులను మొత్తం ముగ్గురు దోషులుగా అక్కడి న్యాయస్థానం గుర్తించింది. కాస్మెటిక్ క్లినిక్ గురించి ఆన్ లైన్ లో ప్రకటనలు ఇచ్చి.. ఏడుగురు బాధితులను క్లినిక్ కు రప్పించారు. ఆపై వారికి మత్తు మందు ఇచ్చి మెడికల్ అసిస్టెంట్ అత్యాచారం చేశాడు. ఇద్దరు నర్సులకు ఐదు అత్యాచారం కేసులతో పాటు డ్రగ్స్ దొంగతనం చేసిన ఆరోపణలపై ఉరిశిక్ష విధించారు.

ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక ఉరిశిక్షలు అమలు చేసిన దేశాల్లో ఇరాన్ కూడా ఉంది. హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నవారిలో చాలా మందిని అక్కడి ప్రభుత్వం ఉరితీసింది. గతేడాది ఏకంగా 582 మందిని ఇరాన్ ఉరితీసింది. 2015 తర్వాత ఇదే అత్యధిక సంఖ్య. ఇతర దేశాలతో పోలిస్తే ఇరాన్, చైనా దేశాలు అత్యధికంగా ఉరిశిక్షలను అమలు చేస్తున్నాయి.

Exit mobile version