29 Killed During Capture Of Drug Lord El Chapo’s Son: మెక్సికన్ డ్రగ్ లార్డ్ జోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్ కొడుకు ఒవిడిలో గుజ్మాన్ ను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో దాదాపుగా 29 మంది మరణించారు. ప్రస్తుతం జోక్విల్ గుజ్మాన్ అమెరికాలో జైలులో ఉన్నాడు. ప్రభుత్వ దళాలు, గుజ్మాన్ ముఠాకు చెందిన సభ్యుల మధ్య గురువారం భీకరమైన దాడులు కొనసాగాయి. మెక్సికో ఉత్తర రాష్ట్రమైన సినాలోవాలో ఈ కాల్పలుు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 19 మంది గుజ్మాన్ ముఠా సభ్యులు, 10 మంది సైనిక సిబ్బంది మరణించారని మెక్సికో రక్షణ మంత్రి లూయిస్ క్రెసెన్సియో సాండోవల్ శుక్రవారం వెల్లడించారు. చివరకు మెక్సికన్ దళాలు ఒవిడియో గుజ్మాన్ ను పట్టుకున్నాయి.
Read Also: Veera Simha Reddy Trailer: ట్రైలర్ తోనే హిట్ కొట్టిన బాలయ్య.. థియేటర్ దబిడిదిబిడే
ఈ అరెస్ట్ తర్వాత సినాలోవా అంతటా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఆపరేషన్ లో మరో 21 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ పౌరులు ఎవరూ మరణించలేదని వెల్లడించింది. హింసాకాండకు కేంద్రమైన సినలోవా రాజధాని క్యూలియాకాన్ లోని విమానాశ్రయాన్ని శుక్రవారం మూసేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒవిడియో గుజ్మాన్ ను అత్యంత కట్టుదిట్టమైన ఫెడరల్ జైలులో ఉంచారు. డ్రగ్స్ కు మెక్సికో కేంద్రంగా ఉంది. మెక్సికోతో పాటు దక్షిణ అమెరికాలోని పలు దేశాలు డ్రగ్స్ కు అడ్డాగా ఉన్నాయి.
2017లో “ఎల్ చాపో”ని యునైటెడ్ స్టేట్స్‌కు అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అమెరికాలో జీవితఖైదు అనుభవిస్తున్నాడు. అతని కుమారుడు ప్రస్తుతం డ్రగ్స్ మాఫియాను నియంత్రిస్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి మెక్సికో ప్రభుత్వం ఎల్ చాపో కుమారుడు ఒవిడియో గుజ్మాన్ కోసం గాలిస్తోంది. చివరకు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఒవిడియో గుజ్‌మాన్‌ను పట్టుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ 5 మిలియన్ డాలర్లను వరకు రివార్డ్‌ను ఆఫర్ చేసింది.
