Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. బుధవారం ఉక్రెయిన్ లోని దక్షిణ ఖేర్సన్ ప్రాంతంపై రష్యా క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో 21 మంది మరణించడంతో పాటు 48 మంది గాయపడ్డారు. శుక్రవారం నుండి ప్రధాన నగరమైన ఖెర్సన్‌లో అధికారులు కర్ఫ్యూ విధించారు. రష్యా చేసిన దాడుల్లో నగరంతో పాటు నగరం చుట్టు పక్కల ఉన్న గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో రైల్వే స్టేషన్, క్రాసింగ్, ఇళ్లు, హార్డ్‌వేర్ దుకాణం, ఒక కిరాణా సూపర్ మార్కెట్, గ్యాస్ స్టేషన్ ధ్వంసం అయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తెలిపారు.
Read Also: Russia: జెలెన్ స్కీని చంపడం తప్ప వేరే మార్గం లేదు.. రష్యా తీవ్ర హెచ్చరిక..
ఖేర్సన్ నగరం నుంచి గత నవంబర్ లో రష్యా దళాలు ఉపసంహరించుకున్నాయి. రష్యా జరిగిన దాడిని ప్రపంచం చూడాలని జెలన్ స్కీ అన్నారు. ఖేర్సన్ నగరంలో 12 మంది చనిపోయినట్లు, సమీప గ్రామాల్లో 9మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఖెర్సన్‌లో శుక్రవారం నుండి సోమవారం వరకు కర్ఫ్యూ విధించబడింది. ఉక్రెయిన్ బలగాల మోహరింపును సులభతరం చేయడానికి ఉక్రెయిన్ కర్ఫ్యూ విధించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ లో ప్రధాన నగరం అయిన ఖేర్సన్ ను తొలుత రష్యా ఆక్రమించుకుంది. గతేడాది నవంబర్ లో రష్యన్ బలగాలు అక్కడి నుంచి నిష్క్రమించాయి.