NTV Telugu Site icon

US Elections: ఫలితాలు అదుర్స్.. ట్రంప్‌-230, హారిస్‌- 205

Us Eleltions 2024

Us Eleltions 2024

US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ మధ్య పోరు ఉత్కంఠగా కొనసాగుతుంది. తొలుత ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. హారిస్‌ కూడా బలంగా పుంజుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం. డొనాల్డ్ ట్రంప్‌ 230 ఎలక్టోరల్‌ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఆయన కాన్సస్‌, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, అయోవా, మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకోటా, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, నార్త్‌ కరోలినా వంటి 23 రాష్ట్రాల్లో విజయం సాధించారు.

Read Also: US Young Voters: డొనాల్డ్ ట్రంప్‌ వైపే యువ ఓటర్ల మొగ్గు..!

ఇక, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హారిస్‌ 205 ఎలక్టోరల్‌ సీట్లను దక్కించుకుంది. కాలిఫోర్నియా, కనెక్టికట్‌, డెలవేర్‌, మసాచుసెట్స్‌, రోడ్‌ ఐల్యాండ్‌, కొలరాడో, ఓరెగన్‌, వాషింగ్టన్‌, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌, వెర్మాంట్‌, న్యూయార్క్‌, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా రాష్ట్రాల్లో విజయం సాధించింది. అయితే, అత్యంత కీలకమైన స్వింగ్‌ స్టేట్‌ జార్జియాలో కమలా హారిస్‌ ఎదురీదుతుంది. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్‌ ఓట్లను సాధించినప్పటికీ.. ప్రస్తుతం ఇక్కడ డొనాల్డ్ ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు పెన్సిల్వేనియా (19 ఓట్లు)లో తొలుత హారిస్‌ జోరు కనబర్చగా.. ప్రస్తుతం అక్కడ కూడా ట్రంప్‌ ముందంజలోకి వచ్చేశారు.

Show comments