Site icon NTV Telugu

Military Strength Ranking: మిలిటరీ పవర్‌లో టాప్‌లో అమెరికా, లాస్ట్ భూటాన్.. ఇండియా ర్యాంక్ ఎంతంటే..?

Military Strength Ranking

Military Strength Ranking

Military Strength Ranking: ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశంగా అమెరికా తొలిస్థానంలో నిలిచింది. రష్యా, చైనాలు వరసగా రెండూ, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్ 4వ స్థానంలో నిలిచింది. ప్రపంచ రక్షణ సమాచారాన్ని ట్రాక్ చేసే వెబ్‌సైట్ గ్లోబల్ ఫైర్‌పవర్ 2024కి గానూ ప్రపంచదేశాల మిలిటరీ పవర్‌కి ర్యాంకింగ్స్ కేటాయించింది. 145 దేశాల ర్యాంకుల్ని వెల్లడించింది. సైనికుల సంఖ్య, సైనిక పరికరాలు, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక స్థానం మరియు అందుబాటులో ఉన్న వనరులు వంటి 60 కంటే ఎక్కువ అంశాలను పరిగణనలోకి ఈ పవర్ ఇండెక్స్ స్కోర్‌ని నిర్ణయించారు. ఈ జాబితాలో ఇజ్రాయిల్ 17 స్థానంలో ఉంది.

డిఫెన్స్ బడ్జెట్ పరంగా చూస్తే అమెరికా టాప్‌లో ఉండగా.. చైనా రెండో స్థానంలో, రష్యా 3వ స్థానంలో, భారత్ 4వ స్థానంలో ఉంది. బడ్జెట్ పరంగా పాకిస్తాన్ 47వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 43వ స్థానంలో ఉంది.

Read Also: Sharad Pawar: కీలక రామ మందిర వేడుకని రాజీవ్ గాంధీ జరిపారు.. బీజేపీది రాజకీయం

ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ మిలిటరీ ఉన్న టాప్-10 దేశాలు:

1) అమెరికా
2) రష్యా
3) చైనా
4) భారతదేశం
5) దక్షిణ కొరియా
6) యునైటెడ్ కింగ్‌డమ్
7) జపాన్
8) టర్కీయే
9) పాకిస్తాన్
10) ఇటలీ

ప్రపంచంలో అతి తక్కువ శక్తివంతమైన మిలిటరీని కలిగి ఉన్న 10 దేశాలు ఇక్కడ ఉన్నాయి:

145) భూటాన్
144) మోల్డోవా
143) సురినామ్
142) సోమాలియా
141) బెనిన్
140) లైబీరియా
139) బెలిజ్
138) సియర్రా లియోన్
137) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
136) ఐస్లాండ్

Exit mobile version