NTV Telugu Site icon

4 Days Works: 4 రోజులే పనిదినాలు.. కటింగ్స్ లేకుండా జీతాలు.. ఎక్కడంటే..!

4daysworks

4daysworks

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పని దినాలు గురించి చర్చలు జరుగుతున్న వేళ యూకే కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వారానికి నాలుగు రోజులే పని దినాలుగా ప్రకటించాయి. ఎలాంటి కోతలు లేకుండా జీతాలు ఇస్తామని వెల్లడించాయి. ఇలా దాదాపు 200 కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ కంపెనీల్లో 5,000 మందికిపైగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం స్వచ్ఛంద సంస్థలు, మార్కెటింగ్, టెక్నాలజీ వంటి రంగాలకు చెందినవి. 4 డే వీక్ ఫౌండేషన్ ద్వారా ప్రచారం చేస్తున్న ఈ నిర్ణయానికి ఇప్పుడు సానుకూలంగా నిర్ణయం వచ్చిందని చెప్పవచ్చు. వారానికి నాలుగు రోజుల పని దినాలతో ఉద్యోగులు 50 శాతం ఎక్కువ ఖాళీ సమయాన్ని పొందుతారని ఫౌండేషన్ ప్రచార డైరెక్టర్ జో రైల్ అన్నారు.

ఇది కూడా చదవండి: Vishwak Sen: విశ్వక్ సేన్ దెబ్బకి సినిమా క్యాన్సిల్?

ఈ విధానం ఉద్యోగులు, యజమానులకు ఉపయోగకరమైనదని అనేక బ్రిటిష్ కంపెనీలు భావిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అనుసరిస్తున్నాయి. ప్రారంభంలో మార్కెటింగ్, ప్రకటనలు, ప్రజా సంబంధాలు వంటి రంగాలలో దాదాపు 30 కంపెనీలు ఈ మార్పును ఆమోదించాయి. ఆ తర్వాత ఛారిటీ, ఎన్జీవో, సామాజిక సంరక్షణ రంగాల నుంచి 29 సంస్థలు, టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాలలో 24 సంస్థలు ఈ మార్పు ఆమోదించాయి. ఈ పద్ధతి ద్వారా ఉత్పాదకతను పెంచడానికి, ప్రతిభను ఆకర్షించడానికి సరిగ్గా ఉపయోగపడతాయని మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.

వారానికి నాలుగు రోజులే పని దినాలు కావడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారంలో ఉద్యోగులకు అదనంగా దొరికే సమయం, వారి జీవితాలను సంతృప్తికరంగా, ఆనందంగా గడపడానికి తోడ్పడుతుందన్నారు.

ఇది కూడా చదవండి: Esther Anuhya Case: ఎస్తేర్ అనూహ్య హత్యాచార కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. చేతులెత్తేసిన పేరెంట్స్