గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి అగ్రరాజ్యమైన అమెరికాతో తో పాటు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌తో సతమతవుతున్న వేళ ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఫ్రాన్స్‌లో కలవరం పుట్టిస్తుంది. యూకే, యూఎస్ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభన విపరీతంగా ఉంది. అంతేకాకుండా ఒమిక్రాన్ మరణాలు కూడా ఆ దేశాల్లో చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. ఫ్రాన్స్‌లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వీరంగం సృష్టిస్తోంది.
రోజురోజుకు ఫ్రాన్స్ దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కరోనా డెల్టా వేరియంట్‌కు దాదాపు సమానంగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 2 లక్షల కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలాగే కొనసాగితే ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని, ప్రజలు జాగ్రత్త వహించాలని అక్కడి వైద్యశాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరో రెండు మూడు రోజుల్లో ఒమిక్రాన్ కేసులు సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని చెప్పడంతో మరింత ఆందోళన నెలకొంది.
