Site icon NTV Telugu

Paris: పీఎస్‌జీ ఛాంపియన్స్ విజయోత్స వేడుకల్లో ఘర్షణ.. ఇద్దరు మృతి

Paris

Paris

పారిస్‌లో చెలరేగిన హింసలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు.. ఇక భారీగా కార్లు, బైకులు తగలబడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఆదివారం పారిస్‌లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పారిస్ సెయింట్ జర్మైన్ (PSG) క్లబ్ విజయం సాధించింది. ఇంటర్ మిలన్‌పై పీఎస్‌జీ క్లబ్ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను పెద్ద స్క్రీన్‌లపై ఏర్పాటు చేశారు. స్టేడియం వెలుపల దాదాపు 50 వేల మంది ప్రజలు గుమిగూడి మ్యాచ్‌ను వీక్షించారు. ఇక పీఎస్‌జీ క్లబ్ విజయం సాధించగానే అభిమానులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా బాణసంచా పేలిస్తూ నానా హంగామా సృష్టించారు. బాణసంచాను విసిరడంతో ఒక్కసారిగా అల్లర్లు మొదలయ్యాయి. అభిమానులు-పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలు, వాటర్ కేన్‌లు ప్రయోగించారు. దీంతో అభిమానులు మరింత రెచ్చిపోయి.. వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పోలీసులతో సహా వందల మంది ప్రజలు గాయాలు పాలయ్యారు.

ఇది కూడా చదవండి: Siddipet: BMW కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య..

అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. పారిస్‌లో జరిగిన హింసలో ఇద్దరు మృతిచెందగా.. 21 మంది పోలీస్ అధికారుల సహా 200 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఫుట్‌బాల్ అభిమానులు బాణసంచా కాల్చారని.. అంతేకాకుండా బస్ షెల్టర్లు, కార్లు ధ్వంసం చేశారని తెలిపారు. అనంతరం రాజధానిలో 491 మందిని అరెస్ట్ చేయగా.. ఫ్రాన్స్ అంతటా 559 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బాణసంచా, ఇతర వస్తువులు విసిరి అభిమానులు ఘర్షణ సృష్టించారని పేర్కొన్నారు.

ఇక ఆగ్నేయ ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్‌లో అభిమానులపైకి కారు దూసుకెళ్లిందని.. దీంతో నలుగురు గాయపడ్డారని.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. అయితే డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని.. మద్యం, డ్రగ్స్ మత్తులో ఇలా చేసినట్లుగా చెప్పారు. రాత్రి పూట 692 మంటలు సంభవించాయని. 264 కార్లు దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు.

Exit mobile version