NTV Telugu Site icon

Gaza- Israel War: గాజాలో ఇజ్రాయెల్ దాడులు.. 17 మంది పాలస్తీనియన్ల మృతి..

Gaza

Gaza

Gaza- Israel War: హమాస్‌ అధినేత యాహ్య సిన్వర్‌ మరణించిన గాజాపై ఇజ్రాయెల్‌ తన దాడులను కొనసాగిస్తుంది. గురువారం సెంట్రల్‌ గాజాలోని నుసీరత్‌ శిబిరంపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్స్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 42 మంది తీవ్రంగా గాయాలు అయ్యాయి. మృతుల్లో 13 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఐడీఎఫ్‌ మాత్రం తాము హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా దాడిలు చేశామని వెల్లడించింది. కాల్పుల విరమణ చర్చలు త్వరలోనే స్టార్ట్ అవుతాయని పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఖతార్‌లో ఉన్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పుకొచ్చారు. హమాస్‌ చర్చలకు సిద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని మేం ఇంకా ధ్రువీకరించుకోవాల్సి ఉందన్నారు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్లకు 135 మిలియన్‌ డాలర్ల సాయాన్ని ఈ సందర్భంగా బ్లింకెన్ ప్రకటించారు.

Read Also: Bomb Threat: టెంపుల్‌ సిటీలో కలకలం.. హోటళ్లకు బాంబు బెదిరింపులు..

అయితే, గాజా యుద్ధ వార్తలను అందిస్తున్న ఆరుగురు అల్‌ జజీరా సంస్థ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా ఐడీఎఫ్‌ ప్రకటించింది. తాము గాజాలో కనుగొన్న పత్రాలు, నిఘా వర్గాల సమాచారంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. ఇందులో ఇద్దరికి హమాస్‌తో, నలుగురికి పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌తో సంబంధం ఉందన్నారు. ఈ ఆరోపణలపై అల్‌ జజీరా తీవ్రంగా మండిపడింది. వాస్తవాలను తెలియజేస్తున్న పాత్రికేయుల నోళ్ల మూయించడానికి ఇజ్రాయెల్‌ తప్పుడు ఆరోపణలు చేస్తుందని విమర్శలు గుప్పించింది.