Fire accident: రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
17 Dead In China Restaurant Fire Accident: చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడినట్లు చైనా అధికారులు వెల్లడించారు. చాంగ్ చున్ నగరంలో ఓ రెస్టారెంట్ లో బుధవారం మధ్యాహ్నం 12.40 గంటలకు మంటలు చెలరేగాయి. మంటల వార్తలు తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దాదాపుగా మూడు గంటల పాటు ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పేశారు.
Read Also: Moen Ali: మన్కడింగ్ అవుట్‌ను పూర్తిగా తొలగించాలి.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డిమాండ్
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి పంపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో కూడా ఇలాగే ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. చైనా సెంట్రల్ సిటీ చాంగ్షాలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చైనాలో బిల్డింగ్ అనుమతుల్లో అవకతవకలు, అనధికారిక నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. ఇవే ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
గత ఏడాది జూలైలో ఈశాన్య జిలిన్ ప్రావిన్స్ లోని గిడ్డింగిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మరనింణించారు. 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ముందు సెంట్రల్ హెనాల్ ప్రావిన్సులోని ఓ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది. దీంట్లో 18 మంది మరణించారు. ఇందులో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. 2017లో చైనా రాజధాని బీజింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు. 2010లో షాంఘైలోని 28 అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 58 మంది మరణించారు.
తాజావార్తలు
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి