17 Dead In China Restaurant Fire Accident: చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడినట్లు చైనా అధికారులు వెల్లడించారు. చాంగ్ చున్ నగరంలో ఓ రెస్టారెంట్ లో బుధవారం మధ్యాహ్నం 12.40 గంటలకు మంటలు చెలరేగాయి. మంటల వార్తలు తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దాదాపుగా మూడు గంటల పాటు ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పేశారు.
Read Also: Moen Ali: మన్కడింగ్ అవుట్‌ను పూర్తిగా తొలగించాలి.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డిమాండ్
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి పంపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో కూడా ఇలాగే ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. చైనా సెంట్రల్ సిటీ చాంగ్షాలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చైనాలో బిల్డింగ్ అనుమతుల్లో అవకతవకలు, అనధికారిక నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. ఇవే ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
గత ఏడాది జూలైలో ఈశాన్య జిలిన్ ప్రావిన్స్ లోని గిడ్డింగిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మరనింణించారు. 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ముందు సెంట్రల్ హెనాల్ ప్రావిన్సులోని ఓ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది. దీంట్లో 18 మంది మరణించారు. ఇందులో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. 2017లో చైనా రాజధాని బీజింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు. 2010లో షాంఘైలోని 28 అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 58 మంది మరణించారు.
