ఇండోనేషియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని ఒక వృద్ధాశ్రమంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది సజీవదహనం అయ్యారు. ఉత్తర సులవేసి ప్రావిన్షియల్ రాజధాని మనాడోలోని నర్సింగ్ హోమ్‌లో ఆదివారం రాత్రి 8:31 గంటలకు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికీ మంటలు ఎగిసిపడ్డాయి. తిప్పించుకునే మార్గం లేక అగ్నికీ ఆహుతియ్యారు.
16 మంది సజీవదహనం కాగా.. ముగ్గురికి గాయాలైనట్లు రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ జిమ్మీ తెలిపారు. గదుల్లో మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. సాయంత్రం వేళల్లో మంటలు చెలరేగిన సమయంలో చాలా మంది వృద్ధులు తమ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని వెల్లడించారు. 12 మందిని కాపాడినట్లు చెప్పారు. ప్రమాద దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారం అయ్యాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియ లేదు.
