Istanbul: టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం నైట్ క్లబ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 29మంది మరణించగా.. 10 మంది గాయపడినట్లు నగర గవర్నర్ తెలిపారు. గైరెట్టెప్ ప్రాంతంలోని భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Rajasthan High Court: వివాహేతర శృంగారం నేరం కాదు..
సెంట్రల్ ఇస్తాంబుల్ డిస్ట్రిక్ట్ బెసిక్తాస్‌లో భాగంగా ఉన్న గైరెట్టెప్‌లోని 16 అంతస్తుల భవనంలోని బేస్‌మెంట్ నిర్మాణ పనుల సమయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల్లో ఎక్కువ మంది క్లబ్ నిర్మాణ పనుల్లో ఉన్నవారే అని తెలుస్తోంది. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. క్లబ్ మేనేజర్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.