Site icon NTV Telugu

China: కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

China

China

China: నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఆదివారం కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారని స్థానిక ప్రభుత్వం తెలిపింది. లెషాన్ నగరానికి సమీపంలోని జిన్‌కౌహేలోని ప్రభుత్వ యాజమాన్యంలోని అటవీ స్టేషన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా మట్టి కుప్పలు కూలిపోవడంతో జనాలు వీటి కింద చిక్కుకుపోయారు. బాధితుల శవాలను తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మరో ఐదుగరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

Read Also: Ashish Vidyarthi : తన రెండో పెళ్లికి అసలు కారణం అదేనట.. నిజం చెప్పిన ఆశిష్ విద్యార్థి

రెస్క్యూ ఆపరేషన్ కోసం 180 మందిని సంఘటన స్థలానికి పంపారు. ఈ ప్రదేశం సిచువాన్ రాజధాని చెంగ్డూకు దక్షిణంగా 240 కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో ఉంది. చైనాలో గ్రామీణ పర్వత ప్రాంతాల్లో, ముఖ్యంగా వేసవి నెలలో కొండచరియలు విరిగిపడటం తరుచుగా జరుగుతోంది. అడవులు, కొండలు అధికంగా ఉన్న సిచువాన్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో 2017 సమయంలో జిన్మో గ్రామంపై కొండచరియలు విరిగిపడటంతో 60పైగా ఇళ్లు సమాధి అయ్యాయి.

Exit mobile version