Thailand van accident: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు పిల్లలతో సహా 11 మంది సజీవదహనం అయ్యారు. లూనాన్ న్యూ ఇయర్ సెలవుల సందర్భంగా సెంట్రల్ థాయ్‌లాండ్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదనికి గురైందని 11 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Read Also: Hijab Ban: హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ.. త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు..
12 మందితో వ్యాన్ ఈశాన్య అమ్నాట్ చారోస్ ప్రావిన్స్ నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా సెంట్ర నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్ లో హైవేపై శనివారం రాత్రి అదుపుతప్పి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల విద్యార్థి థానాచిత్ కింగ్ కేవ్ ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రమాదసమయంలో నిద్రలో ఉన్నానని..తోటి ప్రయాణికుల అరుపులు విని నిద్ర లేచానని, అప్పటికే వ్యాన్ తలకిందులుగా పని ఉందని చెప్పాడు.
ప్రమాదం జరిగిన వెంటనే వెనక నుంచి మంటలు వ్యాపించాయని, కిటికీని తన్ని అందులో నుంచి బయటపడ్డానిని థానాచిత్ వెల్లడించారు. తాను బయటకి వచ్చిన తర్వాత వ్యాన్ పేలిందని తెలిపారు. కేవలం 30 సెకన్లలోనే వ్యాన్ మంటల్లో దగ్ధమైందని తెలిపాడు. వ్యాన్ లో ఉన్న ఇంధనం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమికం అధికారులు నిర్దారించారు. అయితే వాహనం రోడ్డు పై నుంచి పక్కకు వెళ్లడానికి కారణాలు తెలియరాలేదు.
