1000 years old treasure: సరదాగా సముద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లారు కొందరు డ్రైవర్లు. అయితే అక్కడ వాళ్లకి ఓ అద్భుతం కనిపించింది అదే 1000 సంవత్సరాల నాటి నిధి. మొదట లోహపు వస్తువులు చూసిన ఆ డైవర్లు ఏముందిలే మామూలు వస్తువులే గా అనుకున్నారు. అనంతరం పరిశీలించగా అది ఎంతో విలువైన నిధి అని తెలిసి ఆశ్చర్య పోయారు. ఈ ఘటన ఇటలీ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఇటలీ లోని సార్డినియా తీరంలో సముద్రగర్భాన్ని కొంతమంది డైవర్లు అన్వేషిస్తుండగా ఇసుక కింద పాతిపెట్టిన కొన్ని లోహపు వస్తువులు కనిపించాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు అవేవో పాత్రలు కావచ్చు అని అభిప్రాయపడ్డారు.
Read also:WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఈసారి ఈ నగరాల్లోనే.. వేలం కూడా అప్పుడే..!
అయితే వాళ్లలో ఆసక్తి ఆ పాత్ర ను పరిశీలించేలా, ఆ ప్రాంతాన్ని మరింత తవ్వేలా ప్రేరేపించింది. ఈ నేపథ్యంలో వెయ్యి సంవత్సరాల కంటే ముందు కాలం నాటి రోమన్ నాణేలు కనిపించాయి. అవి దాదాపు 30,000 నుండి 50,000 ఉన్నాయి. కాగా అవి కోట్ల ధర పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పురావస్తు శాస్త్రవేత్తలు ఆ నాణేలని పరిశీలించారు. అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఈ నాణేలు కాంస్యవని మరియు రోమన్ సామ్రాజ్యానికి సాక్ష్యంగా ఉండవచ్చని తెలిపారు. అలానే ఈ నాణేలను ఫోలిస్ అని పిలుస్తారని, వీటిని 294 ADలో రోమన్ చక్రవర్తి డయోక్లెటియన్విడుదల చేశారని పేర్కొన్నారు. కాగా అక్కడి ప్రభుత్వం వాటిని భద్రపరిచింది.
