NTV Telugu Site icon

Indian Economy: చైనా కన్నా ఎక్కువ.. తొలి త్రైమాసికంలో 7.8 వృద్ధి

Indian Economy

Indian Economy

Indian Economy: ఆర్థికవృద్ధిలో ఇండియా దూసుకుపోతోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం చివరిదైన జనవరి-మార్చి త్రైమాసికంలో 6.1 శాతం జీడీపీ వృద్ధిరేటు నమోదైంది. 2022-23 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 13.1 శాతం గ్రోత్ రేట్ నమోదైంది. అక్టోబరు-డిసెంబర్‌లో జిడిపి వృద్ధి 4.5 శాతంగా ఉంది.

అధిక ప్రైవేటు వినియోగం మరియు ఇన్వెస్ట్మెంట్స్, ద్రవ్యోల్భణంలో వేగంగా పెరుగుదల ఈ ఏడాది కనిపించింది. ఈ ఆర్థిక సంవత్సరం( ఏప్రిల్ 1-మార్చి 31) మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్ నెలలో చైనా వృద్ధిరేటు కేవలం 6.3 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థగా ఉంది.

Read Also: Rakhi Festival: ప్రేమతో చెట్లకు రాఖీలు కట్టిన చిన్నారి.. స్వయంగా 105 రాఖీలు తయారు

ప్రస్తుతం కొనసాగుతున్న జూలై-సెప్టెంబర్ త్రైమాసిక వృద్ధి గణాంకాలు నవంబర్ 30న విడుదల కానున్నాయి. గతేడాది 2.4 శాతంతో పోలిస్తే వ్యవసాయ రంగంలో 3.5 శాతం వృద్ధిరేటు నమోదు చేయగా.. తయారీ రంగంలో వృద్ధి 6.1 శాతం నుంచి 4.7 శాతానికి పడిపోయింది.

అంతకుముందు ప్రభుత్వం 2023 టాప్ 10 ఆర్థిక వ్యవస్థ జీడీపీ వృద్ధిరేటును అంచనా వేసింది. భారతదేశం జీడీపీ నంబర్ వన్ స్థానంలో ఉంటుందని, భారత జీడీపీ వృద్ధి 5.9 శాతం, చైనా జీడీపీ 5.2 శాతం, అమెరికా జీడీపీ 1.6 శాతం ఉంటుందని అంచానా.