Gold and Silver Price: పసిడితో పాటు వెండి కొనుగోలు చేయాలని చూసేవారికి శుభవార్త.. దేశీయ మార్కెట్‌లో ఈ రెండు విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉన్నాయి. వారంలో మొదటి రోజైన సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే వెండి ధర భారీగా పతనమైంది. కిలో వెండిపై ఏకంగా రూ.5,935 తగ్గింది. అంటే 3 శాతానికి పైగా ధర పడిపోయింది. మరోవైపు బంగారం ధర కూడా తగ్గుముఖం పట్టింది.
కిలో వెండిపై రూ.5,935 తగ్గుదల
CXలో వెండి ఫ్యూచర్స్ ధర గత శుక్రవారం కిలోకు రూ.1,76,309 వద్ద ముగిసింది. అయితే సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే రూ.5,935 తగ్గి రూ.1,70,374కు చేరుకుంది. దీంతో వెండి ధరలో ఒక్కసారిగా భారీ పతనం నమోదైంది. కొనుగోలుదారులకు ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అయితే, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. జనవరి చివరి వారంలో MCXలో వెండి ఫ్యూచర్స్ ధర తొలిసారిగా కిలోకు రూ.4 లక్షల మార్కును దాటి రూ.4,20,048 వద్ద ఆల్‌టైమ్ హైని తాకింది. అయితే ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర గరిష్ఠ స్థాయితో పోలిస్తే ఏకంగా రూ.2,49,674 తగ్గింది. అంటే దాదాపు రూ.2.5 లక్షలు చౌకగా మారింది. అక్టోబర్ నెలలోనే వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించగా, నవంబర్‌లోనూ అదే ధోరణి కొనసాగుతోంది. అక్టోబర్ 30న MCXలో కిలో వెండి ధర రూ.1,79,132 వద్ద ముగిసింది. ప్రస్తుతం రూ.1,70,374కు చేరడంతో ఈ నెలలో ఇప్పటివరకు కిలో వెండిపై రూ.8,758 తగ్గుదల నమోదైంది.
వెండి బాటలోనే బంగారం ధర కూడా..
వెండితో పాటు బంగారం ధర కూడా సోమవారం తగ్గింది. MCXలో డిసెంబర్ 4 గడువు కలిగిన బంగారం ఫ్యూచర్స్ ధర గత శుక్రవారం 10 గ్రాములకు రూ.1,36,705 వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే రూ.1,35,600కు పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారంపై రూ.1,105 తగ్గుదల నమోదైంది. ఇక, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 రూపాయలు తగ్గి రూ.13,6800కి దిగి వచ్చింది.. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గడంతో రూ.12,5400కి పరిమితమైంది.. మొత్తంగా చూస్తే వెండి, బంగారం ధరలు వరుసగా తగ్గుతుండటం కొనుగోలుదారుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టే ముందు తాజా ధరలు, మార్కెట్ పరిస్థితులను పరిశీలించడం మంచిది.

