Gold Prices: షాకింగ్‌.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?

Gold

Gold

Gold Prices: పసిడి ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌ తగిలింది.. ఒకేసారి అమాంతం పెరిగింది.. ఇవాళ ఏకంగా తులం బంగారం ధర దాదాపు 14 వేల రూపాయల వరకు పెరగడంతో బంగారం కొనాలి అని ప్లాన్‌ చేస్తున్నవారికి బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది.. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పెరింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఏకంగా రూ.13,910 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.12,750 పెరిగింది.. ఇక, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,430 మేర పెరిగింది..

దీంతో, ఇవాళ హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,67,890కు ఎగిసింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,53,900.. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,920కి పెరిగింది.. ఇదే సమయంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది.. కిలో వెండి ధర రూ.100 పెరగడంతో రూ.3,00,100కు చేరుకున్నట్టు అయ్యింది..

ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించిన విషయం విదితమే కాగా.. 24 గంటల్లోనే ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచుతూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి 15 శాతానికి పెంచారు. దీనివల్ల విదేశాల నుండి దిగుమతి అయ్యే బంగారం మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఈ పెరిగిన రేటు మే 13, బుధవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి రానుంది.. ఈ నేపథ్యంలో పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి..