జనవరి 15, శనివారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారికి బంధువుల రాక ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం.
వృషభం : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక విషయాల్లో ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ శక్తిసామర్థ్యాలను ఎదుటివారు గుర్తిస్తారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి.
Also Read
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
మిథునం : ఈ రోజు ఈ రాశివారు వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఖర్చుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కష్ట సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు జూదాల్లో ధననష్టం, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోస్తులకు ప్రమోషన్లు, ప్రత్యేక ఇంక్రిమెంట్లు వంటి శుభఫలితాలుంటాయి. పెద్దల ఆహార వ్యవహారాలలో మెళుకువ అవసరం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
కన్య : ఈ రోజు ఈ రాశివారు విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. కార్యసాధనలో జయం, వ్యవహారాల్లో అనుకూలతలుంటాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సాంఘిక, సేవా కార్యక్రమాల్లో స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. పందేలు, జూదాల వల్ల ఇరకాటంలో పడతారు.
తుల : ఈ రోజు ఈ రాశివారు పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. మీ యత్నాల్లో స్వల్ప చికాకులు ఎదురైనా క్రమేణా పరిస్థితులు చక్కబడతాయి. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు రూపొందిస్తారు. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకులు కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమించండి. అనుకున్నది సాధిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల చిరు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీల మాటకు కుటుంబంలోను, సంఘంలోను ఆమోదం లభిస్తుంది. గృహంలో ఏదైనా శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహార, వ్యవహరాలలో మెలకువ వహించండి. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. ఆసక్తికరమైన విషయాలు మీ దృష్టికి వస్తాయి.
మకరం : ఈ రోజు ఈ రాశివారు బంధువులకు శుభాకాంక్షలు అందజేస్తారు. గత విషయాలు జప్తికి రాగలవు. మీ పలుకుబడి, మంచితనం దుర్వినియోగం అయ్యే ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. పెద్దల ఆరోగ్యము కుదుటపడుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు మిత్రులను కలుసుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుండి గట్టెక్కుతారు.
మీనం : ఈ రోజు ఈ రాశివారు ఇతరులను మీ కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంచటం మంచిది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. మీ పనులు మందకొడిగా సాగుతాయి. సత్కాలం ఆసన్నమవుతోంది. మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపం దాల్చుతాయి. రుణ యత్నాల్లో అనుకూలత, పెద్దల సహకారం లభిస్తుంది.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్న్యూస్.. ఎల్బీనగర్–హయత్నగర్ డబుల్ డెక్కర్ కారిడార్కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!