జనవరి 22, శనివారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు మీ శ్రీమతి సహాయం లేనిదే మీ సమస్యలు పరిష్కారం కావని గ్రహించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి.
వృషభం : ఈ రోజు ఈ రాశివారికి బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. సోదరీ, సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పొందగలవు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
Also Read
- Astrology: నవంబర్ 17 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేయాలంటే..?
- Astrology: నవంబర్ 16 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అన్నీ శుభాలే..!
- Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని డబ్బు.. మీరేనేమో తెలుసుకోండి!
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని బేకరి, తినుబండారాల వ్యాపారులకు లాభదాయకం. ప్రైవేటు రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. అధికారులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించటం క్షేమదాయకం. బ్యాంకు వ్యవహారాలలో ధనం పట్ల, అపరిచితులతో మెళుకువ అవసరం. కోల్పోయిన అవకాశం, వస్తువులు చేజిక్కుంచుకుంటారు.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు విధినిర్వహణలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, స్వీట్ షాపు వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థులకు అనుకోని చికాకులు ఎదురవుతాయి. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు ప్రతివిషయంలో ఓర్పు, నేర్పు అవసరమని గమనించండి. ఖర్చులు పెరిగినా ఆర్థిక సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు.
కన్య : ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సమస్యలు, ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. పత్రికా, ప్రైవేటు రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. బంధువులరాక వల్ల మానసికాందోళన తప్పదు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు.
తుల : ఈ రోజు ఈ రాశివారికి ఇతరుల కారణంగా పనులు, కార్యక్రమాలు వాయిదా పడటంతో నిరుత్సాహం తప్పదు. మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. దంపతుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. మిత్రుల సహాయ సహకారాలు అందించడం వలన కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం కానరాగలదు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి సత్ ఫలితాల నిస్తుంది. ధనం చేతిలో నిలబడటం కష్టంకావచ్చు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. శతృవులపై విజయం సాధిస్తారు. సాంఘిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. అపరిష్కృతమైన మీ సమస్యలు పరిష్కార దిశగా పయినిస్తాయి.
మకరం : ఈ రోజు ఈ రాశివారికి వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. కొత్త అనుభవం ఎదురైనందుకు ఆనందించండి.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాతావరణంలోని మార్పులు వల్లమీ పనులు వాయిదా పడతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పని పట్ల మరింత శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. స్త్రీలకు అలంకారాలు, విలాసవస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. వ్యాపారభివృద్ధికి బాగా శ్రమిస్తారు.
మీనం : ఈ రోజు ఈ రాశివారి వ్యాసాగాలు మరింతగా పుంజుకుంటాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కలిగిస్తుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..