మే 17 సోమవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి తప్పదు. ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం వుంది. మరమ్మతులు అనుకూలిస్తాయి.
వృషభం: స్త్రీలకు, వస్త్ర, ఆకస్మిక ధన లాభం వంటి శుభపరిణామాలున్నాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మిత్రులను కలుసుకుంటారు.
Also Read
మిథునం : కంప్యూటర్, ఇన్వర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి కలిసిచ్చేకాలం. స్త్రీలు మోకాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. రాజకీయాల్లో వారికి విరోధులు చేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. రిప్రజెంటేటివ్‌లలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటకం: ఔషధ సేవనం తప్పదు. ఆడిటర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు రాణిస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల్లో వారికి ఆశాజనకం. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు శుభదాయకం.
సింహం: వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
కన్య: ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో వుంచుకోవడం మంచిది. ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి.
తుల: ఆస్తి పంపకాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహన ఏర్పడుతుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. దూర ప్రయాణాల్లో మెలకువ వహించండి. కలప, ఐరన్ వ్యాపారులకు కలిసివచ్చేకాలం.
వృశ్చికం: ఆర్థిక ఇబ్బంది ఏంటూ ఏదీ వుండదు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి కలిసి రాగలదు. ఉద్యోగులకు సహోద్యోగులతో మెళకువ అవసరం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యంలో ఆందోళన అధికమవుతుంది. విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కానరాగలదు. చిన్నతరహా, చిరు వ్యాపారులకు ఆశాజనకం.
ధనస్సు: రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కీలక సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. వేడుకలు, వినోదాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ది. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. రావలసిన ధనం అందుకుంటారు.
మకరం: ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించాల్సి వుంటుంది.
కుంభం: నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. నూతన పెట్టుబడులు పెట్టునప్పుడు మెళకువ వహించండి. టెక్నికల్, లా, మెడికల్ విద్యార్థుల్లో నూతనోత్సాహం కానవస్తుంది. స్త్రీలు వస్త్రాలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అనుకున్న చోటికి బదిలీలు వంటివి ఉంటాయి.
మీనం: వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ముఖ్య విషయాల్లో భాగస్వామి సలహా పాటించడం మంచిది. పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. గృహాలవసరాలకు నిధులు సమకూర్చుకుంటారు.
తాజావార్తలు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్‌కు సెకండ్ హోమ్‌గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
-
శ్రావణంలో నాన్‌వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్‌కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
-
Psychology facts: అర్థరాత్రి.. నిద్రపోని మనసు.. సముద్రంలో అలల్లా ఎగసిపడుతున్న ఆలోచనలకు కారణం ఇదే!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!