మే 25 మంగళవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం
ఈ రోజు గ్రహాల స్థితి కారణంగా మేష రాశి వారికి మధ్యస్తంగా ఉంటుందియ. ఉపాధి కోసం ప్రయత్నిస్తుంటే అందులో విజయం సాధిస్తారు. అంతేకాకుండా కొనసాగుతున్న ప్రయత్నాలు అర్థవంతంగా ఉంటాయి. ఆదాయ, వ్యయాల మధ్య సమతూల్యతను పాటించాలి. కోపం లేదా భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలకు తర్వాత పశ్చత్తాప పడాల్సి ఉంటుంది. అనవసర సమస్యలు ఉండవచ్చు.
Also Read
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
వృషభం
రాశి స్వామి శుక్రుడు వృషభంలో మొదటి, ఏడవ పాదాల్లో ఉండటం వల్ల ఈ రోజు మీ వ్యాపార ప్రణాళిక ఊపందుకుంటుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇవి మీకు లాభదాయకంగా మారతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకుంటే ప్రమాదం సంభవించే అవకాశముంది.
మిథునం
మీ రాశి మొదటి పాదంలో అంగారకుడు, ఐదో పాదంలో చంద్రుడు ఉండటం వల్ల ఈ రోజు మీకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా చేసిన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేసుకుంటారు. సోదరుడు లేదా సహచరుల నుంచి మద్దతు లభిస్తుంది. పనిప్రదేశంలో యజమానితో సమస్యలు కలిగి ఉండవచ్చు. ఫలితంగా మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఈ రోజు సాయంత్రం మీకిష్టమైన వ్యక్తిని కలుస్తారు.
కర్కాటకం
ఈ రోజు గ్రహాల స్థితి కారణంగా పనిప్రదేశంలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా పురోగతి ఉంటుంది. మీ మాటల్లో సౌమ్యత ప్రతిష్ఠను పెంచుతుంది. ప్రజల నుంచి అభినందనలు అందుకుంటారు. అయితే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. ఆహారం మితంగా తీసుకొని తగిన వ్యాయామం చేయండి. అత్తగారి వైపు నుంచి కొంత ప్రయోజనం అందుకుంటారు.
సింహం
ఈ రోజు సింహ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటలపై సంయమనం పాటించండి. వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు. సుదూర ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో విజయం అందుకుంటారు. ప్రేమ జీవితం ఈ రోజు పరిపూర్ణంగా ఉంటుంది. ఇల్లు, కార్యాలయంలో సహనాన్ని కలిగి ఉండాలి. అన్ని సమస్యలను విజయవంతంగా పరిష్కరించుకుంటారు.
కన్య
కన్యా రాశి అధిపతి బుధుడు మీ రాశి నుంచి 9వ పాదంలో ఉన్నాడు. ఈ సమయంలో శత్రువుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఆరోగ్యం మృదువుగా ఉంటుంది. ఈ రోజు మీరు శారీరకంగా అలిసిపోతారు. నొప్పులు రావచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
తుల
తులా రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జీవనోపాధి రంగంలో చేసిన ప్రయత్నాలు విజయంవంతమవుతాయి. సంతానం పురోగతి సాధించడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. కెరీర్ పరంగా కొన్ని చింతలు తీరిపోతాయి. ఈ రోజు మీరు ఏదైనా విలువైన దాన్ని కోల్పోవచ్చు. ప్రత్యర్థులు మీ చేతుల్లో ఓడిపోతారు. కుటుంబ వ్యాపారంలో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో జాగ్రత్తగా ఉండండి.
వృశ్చికం
వ్యాపార ప్రణాళికలు శక్తిమంతంగా ఉంటాయి. ఫలితంగా మీరు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. దాంపత్య జీవితంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ధనస్సు
ఈ రోజు వృశ్చిక రాశిలో చంద్రుడు, కేతువు రావడం వల్ల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చదువులో సఫలీకృతులవుతారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. విలువైన వస్తువును పోగొట్టుకునే అవకాశముంది. ఆగిపోయిన పనులు, తిరిగి ప్రారంభించుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు.
మకరం
వైవాహిక జీవితంలో ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. రోజువారీ వ్యాపారంలో తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. లేకుంటే నష్టం జరగవచ్చు. వ్యాపారంలో సంక్లిష్ట సమస్యలు ఉంటాయి. సీనియర్ వ్యక్తులతో సంప్రదించి పరిష్కరించుకుంటారు. అనవసర విషయాలను పట్టించుకోకపోతే మంచిది.
కుంభం
ఈ రోజు ఆర్థిక విషయాల్లో మీరు చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పిల్లల బాధ్యత నెరవేరుతుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు.
మీనం
ఈ రోజు మీన రాశిలో 9వ పాదంలో చంద్రుడు ఉండటం వల్ల పనిప్రదేశంలో విజయం సాధిస్తారు. ఇంటి అవసరాలు పెరుగుతాయి. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. లేకుంటే ఇబ్బందులు ఉండవచ్చు. ఈ రోజు మీరు ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది. ఫలితంగా ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని అశుభవార్తలను వినే అవకాశముంది.
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!