జులై 12, సోమవారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీయొచ్చు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
వృషభం : మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పు పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి.
Also Read
- Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
మిథునం : రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశాల సందర్శనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుద్యోగులు సత్ఫలితాలు పొందుతారు.
కర్కాటకం : రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉపాధ్యాయుల తొందరపాటుతన వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రేమికులకు పెద్దల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
సింహం : ఆడిటర్లకు అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికం. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. కీడు తలపెట్టిన స్నేహానికి దూరంగా ఉండండి. ఓర్పుతో వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కన్య : ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. బ్యాంకు పనులు వాయిదాపడతాయి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.
తుల : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. ఓర్పు, నేర్పుతో మీరు అనుకున్నది సాధిస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి.
వృశ్చికం : ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలు ఉంటాయి. విదేశీయానం, రుణ యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఏ విషయంలోనూ మనస్థిమితం అంతగా ఉండదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటాయి.
ధనస్సు : మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆటోమొబైల్, ట్రాన్స్‌పోర్టు రంగాలలో వారికి జయం చేకూరును. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. విద్యార్థులకు వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోను అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం.
మకరం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. మీ విషయంలో ఒక చిన్నపొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికం.
కుంభం : ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. పొదుపు చేయాలనే ప్రయత్నం ఫలించదు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
మీనం : శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. గొప్ప గొప్ప అవకాశాలు మీ దరికి చేరతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
Clothes Washing Tips: బట్టలు ఉతకడానికి ముందు ఎంతసేపు నానబెట్టాలి? ఈ తప్పు చేస్తే మీ బట్టలు పాడైపోవడం ఖాయం!
-
HP New Laptops Launched: HP OmniBook 5, ProBook 4 G2iS భారత్ లో లాంచ్.. రూ.1.10 లక్షల ల్యాప్‌టాప్ రూ.79,999కే!
-
US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
-
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
-
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!