మే 13 గురువారం, దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : రాజకీయాల్లో వారికి ఒత్తిడి, ఆందోళన తప్పదు. నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఆత్మనిగ్రహం చాలా అవసరం. స్త్రీలు విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు. గతంలో నిలిపివేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయు యత్నాలు కలిసివస్తాయి.
వృషభం : ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. రుణం తీర్చడానికే చేయు యత్నాలు వాయిదాపడతాయి. స్థిర చరాస్థుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకోవలసి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చేకాలం.
Also Read
మిథునం : కంప్యూటర్, ఇన్వర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి కలిసిచ్చేకాలం. స్త్రీలు మోకాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. రాజకీయాల్లో వారికి విరోధులు చేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. రిప్రజెంటేటివ్లలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటకం : ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన వంటి చికాకులు అధికమవుతాయి. దుబారా నివారించలేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. హామీలు ఇచ్చే విషయంలోనూ, మధ్యవర్తిత్వ వ్యవహారాలలో మెళకువ వహించండి. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి.
సింహం : అందరితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పథకాలు, ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చగలవు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిమ్మలను చిన్నచూపు చూసినవారే మీ ఉన్నతిని కొనియాడుతారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మస్థయిర్యంతో అడుగు ముందుకువేయండి.
కన్య : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో చికాకు తప్పదు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. విద్యార్థులు పై చదువులకై చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది.
తుల : విద్యార్థినులకు టెక్నికల్, సైన్స్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మలను నిరాశపరుస్తుంది. పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, పలు ఆలోచనలు స్ఫురిస్తాయి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. ఆరోగ్యం విషయంలో సంతృప్తికానరాదు.
వృశ్చికం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. కార్యసాధనలో అధిక శ్రమ, ప్రయాసలు ఎదుర్కొన్నా జయం లభిస్తుంది. పాత వ్యవహారాలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. విద్యార్థులు క్రీడా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. పీచు, ఫోమ్, లెదర్, చిన్న తరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి.
ధనస్సు : నిరుద్యోగుల రాత, మౌఖిక పరీక్షలలో సఫలీకృతులవుతారు. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.
మకరం : ఉద్యోగస్తులు తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. గత కొంత కాలంగా మీరు అనుభవిస్తున్న ఒత్తిళ్లు, చికాకులు క్రమంగా తొలగిపోగలవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాటపడక తప్పదు. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అర్థించవచ్చు.
కుంభం : రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థల వారి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. నిరుద్యోగులకు నిరంతరం కృషి అవసరమని గమనించండి. మీ ఆలోచను మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. దుబారా నివారించలేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. మీ ఆసయ సాధనకు ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం లభిస్తుంది.
మీనం : కోళ్ళ, మత్స్యు, గొర్రెల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. నూతన అగ్రిమెంట్లు వాయిదా వేయడం మంచిది. వస్త్ర, కళంకారి వ్యాపారస్తులకు లాభదాయకం. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు అవసరం. వైద్యుల తొందరపాటు నిర్ణయాల వల్ల చింతించక తప్పదు. విద్యార్థులకు నూతన పరిచయాలు సంతృప్తినిస్తాయి.
తాజావార్తలు
-
Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్‌స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Harbhajan Singh: “అస్సలు భయపడొద్దు”.. వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి?.. మాస్టర్ ప్లాన్ చెప్పిన హర్భజన్ సింగ్!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
ట్రెండింగ్
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!