Interesting Facts: 4,000 ఏళ్ల రహస్యం.. వారం 7 రోజులే ఎందుకు? అసలు నిజం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Interesting Facts: ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్లీ వారం చివరి సెలవు దాకా అందరి బతుకులు ఈ ఏడు రోజుల చుట్టే తిరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి 365 రోజులు, నెలకు ముప్పై రోజుల దాకా ఉంటాయి.. మరి వారానికి మాత్రం ఏడు రోజులే ఎందుకు? ఎవరు గీశారు ఈ గీత? వాస్తవానికి ఇందులో పెద్ద కథే ఉంది. సుమారు నాలుగు వేల ఏళ్ల కిందట.. అంటే క్రీస్తుపూర్వం 2300 ప్రాంతంలో మెసొపొటేమియాలో ఉన్న సుమేరియన్లు, బాబిలోనియన్లు ఈ లెక్క వేశారని చరిత్ర చెబుతుంది.
అప్పట్లో ఇప్పుడున్నట్టు టెలిస్కోపులు లేవు. ఆకాశం వైపు తలెత్తి చూస్తే కంటికి కనిపించే ఏడు ప్రధాన ఖగోళ వస్తువులే వారికి పెద్ద లోకం. సూర్యుడు, చంద్రుడు, వీటితో పాటు కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని.. వీటినే పవిత్రమైన శక్తులుగా భావించారు వాళ్లు. ఆ ఏడింటి పేర్ల మీదుగానే రోజులకు పేర్లు పెట్టారట. మరోవైపు చంద్రుడు భూమి చుట్టూ ఒక రౌండ్ కొట్టడానికి ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిదిన్నర రోజులు పడుతుంది. దాన్ని సులభంగా లెక్కించుకోవడానికి నాలుగు భాగాలుగా విడగొడితే, ఒక్కో భాగం ఏడు రోజులుగా వచ్చింది. ఖగోళ లెక్కకూ, ఆ ఏడు వస్తువుల పవిత్రతకూ తోడుగా ఈ ఏడు రోజుల పద్ధతి అలా మొదలైందని చెబుతున్నారు.
Also Read
- Lawrence Bishnoi History: కాలేజ్ స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్ దాకా.. పోలీస్ కొడుకు లారెన్స్ బిష్ణోయ్ హిస్టరీ ఇదే..!
- Dussehra History: విజయదశమి, ఆయుధ పూజల వెనుక మరాఠా, రాజపుత్రుల వీర చరిత్ర!
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
కాలం గడిచేకొద్దీ ఇది కేవలం ఆకాశపు లెక్కలా మిగిలిపోలేదు. క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో బాబిలోనియాలో బందీలుగా ఉన్న యూదులు ఈ ఏడు రోజుల పద్ధతిని అందిపుచ్చుకున్నారు. సృష్టి పనికి ఆరు రోజులు పట్టిందని, ఏడో రోజు విశ్రాంతి తీసుకోవాలని తమ నమ్మకాలతో కలిపేశారు. అప్పటిదాకా ఖగోళ లెక్కగా ఉన్న వారం, మనిషికి కాస్త ఊపిరి తీసుకునే విశ్రాంతి రోజుగా మారింది.
అయితే ప్రపంచమంతా ఇదే పద్ధతి పాటించడానికి ఒక చక్రవర్తి నిర్ణయం కారణమైంది. మొదట్లో రోమన్లు ఎనిమిది రోజుల వారాన్ని నడిపించేవాళ్లు. తర్వాత క్రీస్తుశకం 321లో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ అధికారికంగా ఏడు రోజుల వారాన్ని క్యాలెండర్లో చేర్చారు. అంతేకాదు, ఆదివారాన్ని విశ్రాంతి, సెలవు రోజుగా ప్రకటించారు. అక్కడి నుంచి యూరప్ మీదుగా ప్రపంచం మొత్తం ఇదే దారి పట్టింది. ఇవాళ మన క్యాలెండర్లో కనిపించే ప్రతి వారం వెనుక ఇంత ప్రయాణం ఉంది. నాలుగు వేల ఏళ్ల కిందట ఆకాశంలో కనిపించిన ఆ ఏడు వస్తువుల ప్రభావం, మధ్యలో కలిసిన విశ్రాంతి ఆలోచన, చక్రవర్తి వేసిన ముద్ర ఇవన్నీ కలిసి మన రోజువారీ జీవితాన్ని ఇలా ఏడు రోజులుగా మలిచాయని అంటున్నారు.
తాజావార్తలు
-
Interesting Facts: 4,000 ఏళ్ల రహస్యం.. వారం 7 రోజులే ఎందుకు? అసలు నిజం ఇదే!
-
Suriya Scene: సూర్య ‘సీన్’ సినిమా కాపీనా.. డిట్టో దింపేశారా?
-
Sonakshi Sinha: ‘‘రాజీవ్ ఒడిలో సోనియా’’.. రాహుల్ గాంధీకి సోనాక్షి సిన్హా మద్దతు!
-
Aura Kid: ‘ఆరా కిడ్’గా ఫేమస్ అయిన రెండేళ్ల బుడతడు.. 139M వ్యూస్‌తో ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో..
-
Henry Nicholls: భారత్‌పై పోరాటం.. భార్య పుట్టినరోజునే సెంచరీ.. హెన్రీ నికోల్స్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!