Dhurandhar 2: ధురందర్-2లో హైలెట్‌గా ‘‘షిరానీ బలోచ్’’.. ఈ రోల్ పాకిస్తాన్ లీడర్‌దా..?
- ధురంధర్ 2లో షిరానీ బలోచ్ పాత్ర పాకిస్తాన్ లీడర్‌దా..?
- బలూచ్ తిరుగుబాటు లీడర్ ప్రేరణతో షిరానీ పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: స్పై-యాక్షన్ మూవీ ‘‘ధురంధర్: ది రివెంజ్’’ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా థియేటర్లు హౌజ్‌ఫుల్ అవుతున్నాయి. ఆదిత్య ధర్ డైరెక్షన్ ప్రతిభ, రణ్‌వీర్ సింగ్, మాధవన్ యాక్టింగ్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. అయితే, ఈ సినిమాలో ‘‘షిరానీ అహ్మద్ బలోచ్’’ రోల్ హైలెట్‌గా నిలుస్తుంది. బలూచిస్తాన్ తిరుగుబాటుదారుడిగా కనిపించే షిరానీ కథను మలుపుతిప్పే క్యారెక్టర్.
షిరానీ బలోచ్ రోల్‌లో నటుడు-నిర్మాత అయిన బిమల్ ఒబెరాయ్ నటించారు. పీకే, టైగర్ 3, పానిపట్ వంటి సినిమాల్లో నటించారు. ధురంధర్ 2లో షిరానీ పాత్ర చిన్నదైనప్పటికీ, కీలక సమయం కథను మలుపుతిప్పే సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ సీన్స్‌లో షిరానీ ఎంట్రీ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఉగ్రవాద నెట్వర్క్‌తో సంబంధం ఉన్న వ్యక్తిగా, పాకిస్తాన్‌లో బలూచ్ తిరుగుబాటుదారుగా కనిపిస్తారు.
Also Read
పాకిస్తాన్ లీడర్ ప్రేరణ:
షిరానీ రోల్ చాలా మందిని ప్రేరణగా తీసుకుని రాసినట్లుగా చెబుతున్నారు. వీరిలో మౌలానా మహమ్మద్ ఖాన్ షిరానీ నుంచి ఇన్‌స్పైర్ అయినట్లుగా తెలుస్తోంది. మౌలానా ముహమ్మద్ ఖాన్ షిరానీ ఒక పాకిస్తానీ ఇస్లామిక్ పండితుడు, రాజకీయ నాయకుడు. ఆయన తరచుగా తీవ్రవాద భావజాలంతో సంబంధం కలిగి ఉండేవారు. ఆయన జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (JUI)తో సంబంధం కలిగి ఉండేవారు. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ ప్రాంతంలో ఒక పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. 2020లో పార్టీ నుండి బహిష్కరించబడిన తర్వాత, ఆయన JUI-షిరానీ అనే తన సొంత పార్టీని స్థాపించారు. గతేడాది 92 ఏళ్ల వయసులో రెండవసారి వివాహం చేసుకోవడంతో షిరానీ తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు.
ఇదే కాకుండా, షిరానీ పాత్రను చాలా వరకు అక్బర్ బుగ్టి నుంచి ప్రేరణ పొందినట్లు నివేదికలు చెబుతున్నాయి. మొదట్లో పాక్ రాజకీయ వ్యవస్థల్లో శక్తివంతమైన నాయకుడిగా ఉన్న అక్బర్ బుగ్టి, ఆ తర్వాత బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. బలూచ్ వనరులను కొల్లగొడుతున్న పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అయితే, పర్వేజ్ ముషారఫ్ పాలన సమయంలో ఆయనను హత్య చేశారు. హత్య తర్వాత బలూచిస్తాన్ నిరసనలు, తిరుగుబాటుకు చిహ్నంగా మారింది. షిరానీ పాత్ర చాలా వరకు ఈ అక్బర్ బుగ్టిని పోలి ఉంది.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?