Site icon NTV Telugu

భువి నుంచి దిగి వచ్చిన ఊర్వశి !

Malavika MOhanan Latest photos Goes Viral

ప్రముఖ మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ చేతిలో ఇప్పుడు కొన్ని టాప్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. తమిళ స్టార్ హీరోలందరి సరసన వరుసగా ఛాన్సులు పట్టేస్తూ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడానికి ప్రయత్నిస్తోంది. ‘మాస్టర్’లో తలపతి విజయ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన మాళవిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే తాజాగా ఓ ఫోటోను షేర్ చేసిన మాళవిక దానికి ఆసక్తికరమైన శీర్షికను జత చేసింది. “ఊర్వశి: దూరప్రాంతంలో సుదూర ప్రాంతం నుండి” అనే క్యాప్షన్ తో ఈ ఫోటోను షేర్ చేసింది. అంటే దివి నుంచి భువికి దిగి వచ్చిన అందాల రాక్షసి ఊర్వశి అన్నమాట.

Read Also : క్యూట్ లుక్ లో బుట్టబొమ్మ… పిక్స్ వైరల్

ఈ ఫోటో విషయానికొస్తే… మాళవిక మోహనన్ పోల్‌ డాట్స్‌తో పొడి బ్లూ బ్యాండ్యూ ధరించి కనిపిస్తుంది. ట్యూబ్ బ్లౌజ్, పింక్ డ్రేప్ చీరలో అదిరిపోయింది. ఆమె తాజా ఫోటోషూట్ కోసం పౌరాణిక దేవత ఊర్వశిగా మారింది. మాళవిక దుస్తులను వర్ధా అహ్మద్ రూపొందించారు, స్టైలింగ్ చేశారు. క్రియేటివ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ నగలను ధరించింది ఈ ఊర్వశి. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇక మాళవిక ఇప్పుడు ‘యుధ్రా’, ‘మారన్‌’ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించనుంది.

Exit mobile version