Site icon NTV Telugu

ప్రభాస్ చేతుల మీదుగా “కళాకార్” టీజర్

Kalakaar Movie Teaser Released by Prabhas

యంగ్ హీరో రోహిత్ చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఆయ‌న‌ హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ కళాకార్‌. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. మొదటిసారి రోహిత్‌ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మద్యే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టీజర్ ని విడుదల చేసారు.

Read Also : “సైమా 2021” లిస్ట్… “మహర్షి”దే పై చేయి !

టీజర్ బాగుందన్న ప్రభాస్ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. “కళాకార్” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్రబృందాన్ని విష్ చేశారు. ఇక చిత్రబృందం కూడా తమ సినిమా టీజర్ ను విడుదల చేసినందుకు ప్రభాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో వరుస హిట్లు కొట్టిన రోహిత్ 6 టీన్స్‌, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌ అంటూ వంటి సినిమాల్లో నటించారు. శంక‌ర్‌దాదా ఎంబిబిఎస్, నవ వసంతం వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

Exit mobile version