Psychology Facts: పొసెసివ్‌నెస్.. రిలేషన్‌షిప్‌ను నాశనం చేస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఫోన్ మోగితే ఇద్దరిలో ఎవరో ఒకరు నవ్వేవారు. ఇప్పుడు అదే ఫోన్ మోగితే… ఇద్దరిలో ఎవరో ఒకరి ముఖం మారుతుంది. దీని అర్థం ప్రేమ మారిపోయిందనా? అంత త్వరగా చెప్పలేం. ప్రేమ అక్కడే ఉండొచ్చు. కానీ ప్రేమతో పాటు ఇంకేదో వచ్చి కూర్చుంది..అదే అనుమానం..!
మొదట అది చాలా చిన్నదిగా మొదలవుతుంది. ఒకరోజు ఎవరో మాట్లాడటం చూసి కలిగిన అసౌకర్యం. మరో రోజు ఆలస్యంగా వచ్చిన మెసేజ్. ఇంకో రోజు ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా కిందకు తిప్పడం. ప్రతి ఘటనకు ఒక సాధారణ కారణం ఉండొచ్చు. కానీ ప్రేమలో భయం మొదలైనప్పుడు… మనసుకు సాధారణ కారణాల కంటే ప్రమాదాలు కనిపించడమే సులభమవుతుంది.
Also Read
ఎందుకంటే భయపడుతున్న మనసు ప్రశాంతంగా సాక్ష్యాలు వెతకదు. ముందుగా ప్రమాదాన్ని ఊహిస్తుంది. తర్వాత దానికి సరిపోయే సంకేతాలను వెతుకుతుంది. అలా ఒక పేరు కంటపడుతుంది. ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఎవరో పెట్టిన ఫోటో కనిపిస్తుంది. ఒక నవ్వు కనిపిస్తుంది. ఇంతకుముందు ఇవన్నీ సాధారణమైన విషయాలే. ఇప్పుడు ప్రతి దానికి ఒక అర్థం వస్తుంది. “ఎవరు?” “ఎందుకు?” “ఎప్పటి నుంచి?” అక్కడితో ఆగితే బాగానే ఉంటుంది కానీ అనుమానానికి సమాధానం దొరికినప్పటికీ మనసు ప్రశాంతపడకపోతే? అప్పుడు మరో ప్రశ్న పుడుతుంది.
ఆ సమాధానం నిజమేనా? అక్కడి నుంచి నమ్మకం స్థానంలో తనిఖీ మొదలవుతుంది. ఫోన్ ఎక్కడుంది? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎప్పుడు వస్తారు? ఎందుకు ఆలస్యమైంది? ఎవరైనా మెసేజ్ చేస్తే ఎందుకు నవ్వారు? మొదట ఇవన్నీ అడిగే వ్యక్తికి ఒకే ఉద్దేశం ఉంటుంది. ఈ సంబంధాన్ని కాపాడుకోవాలి కానీ ఎదుటి మనిషికి మాత్రం క్రమంగా మరో అనుభూతి మొదలవుతుంది.
ప్రతి పని చెప్పాలి. ప్రతి స్నేహానికి వివరణ ఇవ్వాలి. ప్రతి ఆలస్యానికి కారణం చెప్పాలి. ప్రతి మౌనానికి అర్థం చెప్పాలి. ప్రేమలో ఉన్న ఇద్దరు మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కంటే… ఒకరికి ఒకరు నిరూపించుకోవడంలోనే ఎక్కువ సమయం కరిగిపోతుంది.
ఇక్కడే అసూయ గురించి ఒక ముఖ్యమైన విషయం సైకాలజీ చెబుతుంది. అసూయ వెనుక భయం ఉంటుంది. కోపం ఉంటుంది. బాధ ఉంటుంది. కోల్పోతామనే ఆందోళన ఉంటుంది. ఎదుటి వ్యక్తి మన నుంచి దూరమవుతున్నాడనే ఊహ ఉంటుంది. అందుకే అసూయ వచ్చినప్పుడు మనిషి చేస్తున్న పని వెనుక ప్రేమ ఉండొచ్చు కానీ ఆ ప్రేమను నడిపిస్తున్నది భయం కూడా కావచ్చు. 2014లో క్యాథీ డాండురాండ్, మేరీ ఫ్రాన్స్ లాఫోంటైన్ చేసిన పరిశోధనలో 502 మంది ప్రేమ సంబంధాల్లో ఉన్న యువతను పరిశీలించారు.
అసూయకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉన్నవారిలో సంబంధం పట్ల సంతృప్తి తక్కువగా ఉన్నట్టు కనిపించింది. ముఖ్యంగా అసూయ అనిపించడం ఒక్కటే విషయం కాదని, ఆ భావనను ఎలా వ్యక్తపరుస్తామన్నదే సంబంధంపై ప్రభావం చూపుతుందని ఆ పరిశోధన సూచించింది. అంటే… అసూయ వచ్చిందని ప్రేమ పాడైపోదు కానీ ఆ అసూయకు మనం ఇచ్చే రూపం సంబంధాన్ని మార్చేస్తుంది.
“నాకు భయంగా ఉంది” అని చెప్పినప్పుడు ఎదుటి మనిషికి మనసు కనిపిస్తుంది. “ఎవరితో మాట్లాడావు?” అని ప్రశ్నించినప్పుడు అనుమానం కనిపిస్తుంది. “నన్ను వదిలేస్తావేమో అని భయపడుతున్నాను” అంటే దగ్గరితనం కోరుతున్నట్టుగా ఉంటుంది. “ఇక నుంచి అతనితో మాట్లాడకు” అంటే స్వేచ్ఛను తీసుకుంటున్నట్టుగా మారుతుంది. ఒకే భయం కానీ వేర్వేరు భాషలు.
ఇక్కడే సంబంధం భవిష్యత్తు మారుతుంది. ఎందుకంటే ప్రేమలో ఉన్న వ్యక్తిని మన దగ్గరే ఉంచుకోవాలనే కోరిక చాలా సహజం. నీ మన దగ్గర ఉండటానికి కారణం ప్రేమగా ఉండాలి. భయంగా కాదు. ఎవరైనా వెళ్లిపోతారనే భయంతో వాళ్ల చుట్టూ గోడలు కడితే… ఆ గోడలు బయటివాళ్లను ఆపుతాయేమో. కానీ లోపల ఉన్న మనిషికి మాత్రం ఊపిరి తగ్గుతుంది. ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. అందుకే మొదట గుర్తుపట్టడం కష్టం. మొదట ఫోన్ మీద చిన్న గొడవ. తర్వాత స్నేహితుల మీద గొడవ. తర్వాత బయటికి వెళ్లడం మీద గొడవ. ఆ తర్వాత ప్రతి గొడవకు పాత గొడవలు కూడా తోడవుతాయి. ఒక రోజు జరిగిన విషయం మరో రోజు చర్చలోకి వస్తుంది. మూడు నెలల క్రితం జరిగిన విషయం మళ్లీ బయటకు వస్తుంది. ఒక సంవత్సరం క్రితం చెప్పిన మాట కూడా కొత్త ఆరోపణలా మారుతుంది. అప్పుడు సంబంధంలో వర్తమానం ఉండదు. గతం మొత్తం విచారణగా మారుతుంది.
ఒకరికి ప్రతి విషయం వివరించాలి. మరొకరికి ప్రతి విషయాన్ని నమ్మాలి. ఇద్దరిలో ఎవరికీ విశ్రాంతి ఉండదు. ఇక్కడే ప్రేమ చాలా విచిత్రమైన స్థితికి చేరుతుంది. ఇద్దరూ విడిపోవాలని అనుకోరు కానీ కలిసి ఉన్న విధానం మాత్రం ఇద్దరినీ అలసిపోయేలా చేస్తోంది. చివరకు అదే బ్రేకప్ స్థాయికి కూడా వెళ్లగలదు. అందుకే అసూయ ఎప్పుడూ చెడ్డదే అని మర్చిపోవద్దు.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి