Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
45ఏళ్ల వ్యక్తి.. బయటికి చూస్తే అంతా సాధారణంగానే కనిపిస్తాడు. ఉద్యోగం, కుటుంబం, రోజువారీ జీవితం… పెద్దగా ఇబ్బంది ఏదీ కనిపించదు. కానీ ఒక వైపు మాత్రం శరీరంలో ఒక అవయవం నెమ్మదిగా తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అదే కాలేయం.
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం మొదలైనప్పుడు చాలామందికి ఏమీ అనిపించదు. రోజులు గడుస్తాయి. నెలలు గడుస్తాయి. సంవత్సరాలు గడుస్తాయి. ఆ కొవ్వు అలాగే ఉండిపోవచ్చు. కొంతమందిలో మాత్రం అక్కడి నుంచి మరో ప్రయాణం మొదలవుతుంది. కాలేయ కణాల్లో వాపు, నష్టం, ఆ తర్వాత మచ్చలు ఏర్పడటం మొదలవుతుంది. ఆ మచ్చలు విస్తరిస్తూ పోతే చివరికి సిరోసిస్ అనే తీవ్రమైన దశకు చేరుకోవచ్చు.
ఇప్పుడు అమెరికాలో జరిగిన ఒక కొత్త పరిశోధనలో వెలుగులోకి వచ్చిన విషయం ఇక్కడే ఆసక్తికరంగా మారుతుంది. ఈ తీవ్రమైన దశ వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే సమస్యగా భావించాల్సిన అవసరం లేదని పరిశోధన సూచిస్తోంది. కొంతమందిలో 50ఏళ్లు కూడా రాకముందే కాలేయం సిరోసిస్ స్థాయికి చేరుతోంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు సుమారు 2,400 మంది MASLD ఉన్న వ్యక్తుల వివరాలను పరిశీలించారు. ఈ పరిశోధన సెప్టెంబర్ 16న క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. అక్కడ ఒక ఆసక్తికరమైన నమూనా కనిపించింది. సిరోసిస్ ఉన్నవారిలో దాదాపు నాలుగో వంతు మందికి 50 ఏళ్లలోపే ఆ స్థాయి కాలేయ నష్టం ఏర్పడింది. అంతకంటే ముఖ్యమైన విషయం… చిన్న వయసులో సిరోసిస్ వచ్చినవారిలో జన్యుపరమైన ప్రమాదం, టైప్-2 మధుమేహం రెండూ ప్రత్యేకంగా కనిపించాయి.
Also Read
- HIV AIDS: ఎయిడ్స్ మరణాలు పెరుగుతున్నాయా?
- Drought: కరువు భారతం.. తెలుగురాష్ట్రాల్లో మరింత ఘోరం!
- Explainer: మనిషి అహంకారాన్ని కూల్చిన సిద్ధాంతం.. 167ఏళ్ల క్రితం విడుదలైన ఈ పుస్తకం ప్రపంచాన్ని ఎలా కుదిపేసింది?
- Iran: హిజాబ్ లేకుండా పాట..74 కొరడా దెబ్బల శిక్ష.. మహిళ గొంతుపై మతాధికారుల మానవ హక్కుల హననం!
ఇది ఒకే కారణంతో జరగదు. శరీరంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితికి జన్యుపరమైన ప్రభావం తోడవుతుంది. దానికి మధుమేహం కూడా జతకలిస్తే కొంతమందిలో కాలేయ నష్టం మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాలేయం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. కాలేయంలో మార్పులు మొదలైన వెంటనే తీవ్రమైన నొప్పి రాకపోవచ్చు. అందుకే ఒక వ్యక్తి తన రోజువారీ పనులన్నీ సవ్యంగానే చేసుకుంటూ ఉండొచ్చు. లోపల మాత్రం కాలేయంలో మచ్చలు పెరుగుతూ ఉండొచ్చు.
ఈ కొత్త పరిశోధన మరో సమస్యను కూడా బయటపెట్టింది. కాలేయంలో మచ్చలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అంచనా వేయడానికి ఉపయోగించే కొన్ని సాధారణ పద్ధతుల్లో వయసుకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. చిన్న వయసు ఉన్న వ్యక్తికి ప్రమాదం తక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కానీ ఈ పరిశోధనలో 50ఏళ్లలోపు సిరోసిస్ ఉన్నవారిలో దాదాపు మూడో వంతు మందిని సాధారణ ప్రమాద అంచనాలు గుర్తించలేకపోయాయని పరిశోధకులు చెప్పారు. అంటే వయసు ఒక్కటే చూసి కాలేయ ప్రమాదాన్ని అంచనా వేయడం కొన్ని సందర్భాల్లో సరిపోకపోవచ్చు.
ముఖ్యంగా టైప్-2 మధుమేహం ఉన్నవాళ్లు, అధిక బరువు ఉన్నవాళ్లు, కొవ్వు కాలేయం ఉన్నవాళ్లు… వీళ్లలో కాలేయం పరిస్థితిని మరింత జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉండొచ్చు. జన్యుపరమైన ప్రమాదం కూడా ఉన్నప్పుడు వైద్యులు మరింత సమగ్రంగా అంచనా వేయవచ్చు. ఎందుకంటే సిరోసిస్ దశకు చేరుకున్న తర్వాత కాలేయం నిర్మాణంలోనే శాశ్వతమైన మార్పులు మొదలవుతాయి. అదే సమయంలో కాలేయ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది.
- Tags
- Explainers in Telugu
తాజావార్తలు
-
Idupu Kayitham Song: ‘ఇడుపు కాయితం’ నుంచి మరో క్రేజీ సాంగ్..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
Delimitation Bill: డీలిమిటేషన్ బీజేపీ రాజకీయ కుట్ర.. ఏపీకి 25 ఎంపీ సీట్ల నష్టం..!
-
Rohit Sharma: “తొలుత కెప్టెన్సీ వద్దనుకున్న.. అతడు చెప్పడంతోనే అంగీకరించా”.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..
-
Story Board: డీలిమిటేషన్‌పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు..?
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!