Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ ‘షాక్’ అస్త్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు కలల సౌధంగా ఉండే అమెరికా క్రమేపీ మానవత్వాన్ని మరచిపోతోంది. ముఖ్యంగా వలసవాదుల విషయంలో క్రూరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. అక్రమ వలసదారులను ఏరివేసేందుకు ఇమిగ్రేషన్ విభాగానికి అపరితమైన అధికారాలు ఇస్తోంది ట్రంప్ ప్రభుత్వం. తాజాగా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రికల్ షాక్ గ్లౌజులను కొనుగోలు చేసేందుకు ఇమిగ్రేషన్ విభాగం రెడీ అవుతోంది. ఎవరిపైనన్నా అనుమానం ఉంటే వాళ్లను పట్టుకునే సమయంలో షాకింగ్ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. ఇంతటి దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా?
పైకి అక్రమ వలసదారులు అనే మాట చెబుతున్నా… అసలు అమెరికాలో వలసదారులే ఉండకూడదు అన్నది ట్రంప్ పాలసీలా కనిపిస్తోంది. ఎందుకంటే అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ లేనంత తీవ్రంగా వలసదారుల వ్యతిరేక విధానాన్ని అమెరికా అమలు చేస్తోంది. దీని కోసం అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ… ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు చాలా గట్టిగా పనిచేస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అక్రమ వలసదారుల చేతులు వెనక్కి విరిచిమరీ తరిమేసిన ట్రంప్ ప్రభుత్వం.. ఇప్పుడు ఇమిగ్రెంట్స్‌కు షాకింగ్ ట్రీట్మెంట్ ఇవ్వబోతోంది.
ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం.. భారీగా ఎలక్ట్రిక్ షాక్ గ్లౌజులు కొనుగోలు చేయబోతోంది. అమెరికా అంతటా వలసదారులను అదుపు చేసేందుకు ఈ సరికొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ డీల్ విలువ దాదాపు 10 నుంచి 20 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. కంప్లయంట్ టెక్నాలజీస్ అనే సంస్థ వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారు చేస్తోంది. ఎలాంటి టెండర్లు పిలవకుండానే నేరుగా ఈ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ డీల్ ఫైనల్ కానుంది.
Also Read
ఈ ఆధునిక ఎలక్ట్రిక్ షాక్ గ్లౌజులకు ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు. వీటిని జనరేటెడ్ లో అవుట్‌పుట్ వోల్టేజ్ ఎమిటర్… షార్ట్ కట్లో గ్లోవ్ అని పిలుస్తున్నారు. మామూలు సమయాల్లో ఇవి సాధారణ పోలీస్ గ్లౌజుల్లాగే కనిపిస్తాయి. అయితే అధికారులు అందులోని స్విచ్ ఆన్ చేసి వలసదారుల చర్మంపై చేతులు వేస్తే చాలు… తీవ్రమైన కరెంట్ షాక్ తగులుతుంది. దీనివల్ల బాధితుల నరాలు పనిచేయడం ఆగిపోయి విపరీతమైన నొప్పి వస్తుంది. కేవలం సెకన్ల వ్యవధిలోనే మనిషి కదలికలు పూర్తిగా స్తంభించిపోతాయి. ప్రతిఘటించే వ్యక్తులను సులభంగా లొంగదీసుకునేందుకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది.
ఈ గ్లౌజుల వినియోగం వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని తయారీ సంస్థే స్వయంగా హెచ్చరిస్తోంది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలతో పాటు దివ్యాంగుల చర్మంపై వీటిని ప్రయోగించకూడదని యూజర్ మాన్యువల్‌లో స్పష్టంగా రాశారు. షాక్ తీవ్రతకు ఆకస్మాత్తుగా గుండె ఆగిపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉందట. అయితే ఇమిగ్రేషన్ అధికారులకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. వలసవాదులను ఈ రకంగా బయటపెట్టి అమెరికా సరిహద్దులు దాటించడమే వీళ్ల ప్లాన్ గా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ గ్లౌజులు వాడితే ప్రాణ నష్టం భారీగా ఉంటుందని పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఎలక్ట్రిక్ ఆయుధాలపై చాలా దేశాల్లో ఎప్పటినుంచో నిషేధం అమలులో ఉంది. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే పరికరాలను కేవలం హింసించేందుకు వాడే ఆయుధాలుగా ప్రపంచ దేశాలు పరిగణిస్తాయి. అందుకే ఐరోపా సమాఖ్య సైతం వీటి వాడకంపై కఠినమైన ఆంక్షలు విధించింది. నేరుగా శరీరానికి షాక్ ఇచ్చే ఆయుధాలు అత్యంత క్రూరమైనవని ఐక్యరాజ్యసమితి గతంలోనే తేల్చి చెప్పింది. మానవ హక్కుల ఉల్లంఘనకు ఇవి దారితీస్తాయని… ప్రభుత్వాలు వెంటనే వీటిని పూర్తిగా నిషేధించాలని గట్టిగా హెచ్చరించింది.
అమెరికాకు ఇప్పటికే మానవ హక్కుల ఉల్లంఘనలో చెడ్డపేరు ఉంది. గత ప్రభుత్వాల హయాంలో వలసదారులపై విచక్షణారహితంగా దాడులు చేసిన ఘటనలు అమెరికాలో కోకొల్లలు. కనీస శిక్షణ లేని అధికారుల చేతిలో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ గ్లౌజులు పెడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అమెరికా కాంగ్రెస్ వెంటనే స్పందించి ఈ కొనుగోళ్లపై నిష్పాక్షిక విచారణ జరపాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వివాదాస్పద ఆయుధాలతో ఇమిగ్రేషన్ విభాగానికి మరింత స్వేచ్ఛ ఇవ్వకూడదని గట్టిగా కోరుతున్నాయి.
తాజావార్తలు
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!