Explainer: చైనా యువతను AI నిండా ముంచిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొద్దున్న లేచింది మొదలు… మనవాళ్లు చైనాను కీర్తించే పనిలోనే ఉంటారు. అన్ని రంగాల్లో దూసుకుపోతోంది… వరల్డ్ సూపర్ పవర్ అంటే అమెరికా కాదు చైనా మాత్రమేనని… డప్పుకొడుతూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే… ఒక్కోసారి అభివృద్ధి పేరుతో వేసే ముందడుగులు కూడా వినాశనానికి కారణమవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చైనా ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. అన్ని రంగాల్లోనూ తిష్ట వేసిన ఏఐ… చైనాలో యువతకు ఉపాధి లేకుండా చేసేసింది. ఒక రకంగా చైనా ఆర్థిక వ్యవస్థను… రాజకీయాలను ఈ ఏఐ జాబ్ క్రైసిస్ కుదిపేస్తోంది.
చైనాలో చదువుకున్న యువతకు ఇప్పుడు అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? ఏ దేశమైనా యువత చేతికి పనులు ఇవ్వాలి అనుకుంటుంది. కానీ అక్కడ మాత్రం కృత్రిమ మేధస్సు వాళ్ల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. కోట్లు ఖర్చు పెట్టి చదువుకున్నా… కనీసం ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు కూడా దొరకని పరిస్థితి చైనా యువతను వెంటాడుతోంది. మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసి… అదనపు స్కిల్స్ నేర్చుకుని… ఉద్యోగం కోసం 200 వందలకు పైగా కంపెనీలకు అప్లై చేసినా… ఒక్క చోట నుంచి కూడా పిలుపు రాని వాళ్లు చైనాలో కోకల్లలుగా కనిపిస్తున్నారు. గతంలో ఎంతోమంది కలిసి చేసే డిజైన్ ప్రాజెక్టులను ఇప్పుడు ఏఐ కేవలం కొన్ని క్లిక్స్తో పూర్తి చేస్తోంది. దీంతో కొత్తగా వచ్చే గ్రాడ్యుయేట్లకు ఉపాధి దొరకడం కష్టంగా మారింది.
చైనాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1.27 కోట్ల మంది కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగ వేటలో పడ్డారు. ఒకవైపు మందకొడిగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థ వాళ్లను కలవరపెడుతుంటే… మరోవైపు ఏఐ రూపంలో కొత్త ముప్పు వచ్చి పడింది. ఇప్పటికే ఉద్యోగ మార్కెట్ పూర్తిగా నిండిపోవడంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల సంఖ్య దారుణంగా పడిపోయింది. దీనికి తోడు కంపెనీలు తమ నియామక ప్రాధాన్యతలను పూర్తిగా మార్చేసుకుంటున్నాయి. పరిశ్రమల స్వరూపాన్ని ఏఐ సమూలంగా మార్చేస్తుండటంతో యువత భవిష్యత్తు అంధకారంగా మారుతోంది.
Also Read
ఏఐ తెస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే అయినా.. చైనాలో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. ప్రభుత్వ మద్దతుతో అక్కడ ఏఐ టెక్నాలజీని విపరీతంగా వాడేస్తున్నారు. నిరుద్యోగ రేటు ఏకంగా 17.9 శాతానికి చేరింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఈ నిరుద్యోగం పెద్ద తలనొప్పిగా మారింది. యువతలో అసంతృప్తి పెరిగితే అది రాజకీయ అశాంతికి దారి తీస్తుందని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఏఐ పేరు చెప్పి ఉద్యోగులను తీసేయొద్దని కంపెనీలకు చైనా పాలకులు గట్టిగా హెచ్చరించారు.
టెక్నాలజీ వాడకం, వినియోగం విషయంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఎప్పుడూ ముందే ఉంటాయ్. చైనా మాత్రం వీటన్నింటికంటే మరో రెండగుల ముందుంటుంది. అందుకే అమెరికా, రష్యా వంటి దేశాల దగ్గర అందుబాటులో లేని టెక్నాలజీలను చైనా అభివృద్ది చేయగలగింది. అదే సమయంలో కృత్రిమ మేథస్సును వాడే విషయంలో కూడా నాలుగాకులు ఎక్కువే చదివింది. అదే చైనా చేసిన… చేస్తున్న అతిపెద్ద తప్పుగా అక్కడి నిరుద్యోగ యువతి చెబుతోంది. అన్ని రంగాల్లో ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో… మాన్యువల్ వర్క్ ఫోర్స్ అవసరం చాలా వరకు తగ్గిపోతోంది. దీంతో లక్షలాది మంది యువత చదివిన కోర్సులతో సంబంధం లేకుండా చిన్నాచితక పనులు చేసుకుంటున్నారు.
- Tags
- AI
- china
- Explainers in Telugu
తాజావార్తలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!