Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ప్రేమ కోసం ఎంతోకాలం ఎదురుచూసిన ఒక మనసు ఉంటుంది. ఎన్నో నిరాశల తర్వాత, ఎన్నో ఒంటరి రాత్రుల తర్వాత, ఎప్పుడో ఒకరోజు తనను అర్థం చేసుకునే మనిషి దొరికాడని అనిపిస్తుంది. అప్పుడు జీవితంలోని చిన్న చిన్న విషయాలకు కూడా ఒక కొత్త అర్థం వస్తుంది.
ఉదయం లేవగానే ఎవరో ఒకరు గుర్తొస్తారు. రోజులో ఏదైనా మంచి విషయం జరిగితే ముందుగా వాళ్లకే చెప్పాలనిపిస్తుంది. ఏదైనా బాధ వస్తే వాళ్ల గొంతు వినాలనిపిస్తుంది. ఫోన్ చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ వారి పేరే మెసేజీలో కనిపిస్తుందేమో అనిపిస్తుంది.
నెమ్మదిగా ఒక మనిషి మన రోజులోకి వస్తాడు. ఆ తర్వాత మన రోజులో ఒక భాగంగా మారిపోతాడు. ఇక్కడి వరకు ప్రేమ చాలా అందంగా ఉంటుంది. కానీ ప్రతి అందమైన విషయం జీవితాంతం మనతోనే ఉండాలని లేదు. కొంతకాలం గడిచాక అదే సంబంధం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో కనిపించడం మొదలవుతుంది. మాటల్లో ఉన్న ప్రేమకు, జీవితంలో కలిసి నడవగలగడానికి మధ్య ఎంత దూరం ఉంటుందో అర్థమవుతుంది.
Also Read
- Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
- Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? పరిశోధనలో బయటపడ్డ నమ్మలేని నిజాలు
- Explainer: గే, ట్రాన్స్జెండర్ల దూకుడు.. రెయిన్బో సునామీలో ట్రంప్ గల్లంతు!
- Abdul El-Sayed: అమెరికా సెనెట్లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!
ఒకరిని ఎంతగా ప్రేమించినా, వాళ్లతో కలిసి జీవించడం మనకు సాధ్యపడకపోవచ్చు. అప్పుడు ఒక విచిత్రమైన నిజం మన ముందు నిలబడుతుంది. ప్రేమతో మొదలైన సంబంధాలను..ద్వేషంతో ముగించాల్సిన అవసరం లేదు. కొన్ని సంబంధాలు ప్రేమ ఉన్నప్పుడే ముగుస్తాయి. ఎందుకంటే ప్రేమ ఒక్కటే జీవితాన్ని నిలబెట్టదు. నమ్మకం కావాలి. గౌరవం కావాలి. మనశ్శాంతి కావాలి. ఇద్దరి జీవితాలు ఒకదానితో ఒకటి నడవగలగాలి. ఇవన్నీ లేకపోతే ప్రేమ ఉన్నా సంబంధం లోపల ఖాళీ పెరుగుతుంది. అది అర్థమైనప్పుడు మెదడు ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్లాలి అని మెదడు చెబుతుంది. కానీ మనసు? అది అంత త్వరగా మూవ్ ఆన్ అవ్వదు. ఒక ఉదయం కూర్చుని నిర్ణయం తీసుకున్నంత మాత్రాన, ఎన్నో సంవత్సరాల అనుబంధం అదే రోజు మాయమవదు.
ఎందుకంటే సంబంధం ముగిసిందనే విషయం మనసుకు చెప్పడం ఒక పని. ఆ సంబంధం లేకుండా జీవించడం నేర్పడం మరో పని. ఇదే అత్యంత కష్టమైన పని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని సైకాలజీ చెబుతుంది. ప్రేమ సంబంధంలో ఉన్నప్పుడు మనం కేవలం ఒక మనిషితో అనుబంధం ఏర్పరుచుకోం.
ఆ మనిషితో కలిసి మన రోజువారీ జీవితం, స్నేహాలు, అలవాట్లు, ఇష్టాలు, భవిష్యత్తు ఊహలు కూడా కొంతవరకు కలిసిపోతాయి. ఈ విషయాన్ని ఎరికా స్లాటర్, వెండి గార్డ్నర్, ఎలి ఫింకెల్ చేసిన 2010 పరిశోధనలో నేరుగా పరిశీలించారు. ప్రేమ సంబంధం ముగిసిన తర్వాత ‘నేను ఎవరు?’ అనే స్వీయ భావనలో మార్పు వస్తుందా అనే ప్రశ్నపై మూడు అధ్యయనాలు చేశారు. సంబంధం ముగిసిన తర్వాత వ్యక్తులు తమను తాము స్పష్టంగా అనుభూతి చెందే స్థాయి తగ్గడం కనిపించింది.
2021లో ప్రచురితమైన ఓ బ్రేకప్ రిలేటెడ్ పరిశోధనలో 87 మందిని 30 వారాల పాటు పరిశీలించారు. అందరిలోనూ బాధ ఒకే విధంగా కొనసాగలేదు. కొందరు త్వరగా కోలుకున్నారు, కొందరు నెమ్మదిగా కోలుకున్నారు, మరికొందరిలో బాధ ఎక్కువకాలం కొనసాగింది. అదే విషయాన్ని పదే పదే ఆలోచించే స్వభావం ఎక్కువగా ఉన్నవారిలో నెమ్మదిగా కోలుకోవడం లేదా ఎక్కువకాలం బాధ కొనసాగడం ఎక్కువగా కనిపించింది. అందుకే అసలు సమస్య మన ఆలోచనలే అవుతాయి.
ఒక మనిషి గురించి ఆలోచించడం మొదలుపెడతాం. ఆ తర్వాత ఎందుకు ఇంకా మర్చిపోలేకపోతున్నానని బాధపడతాం. ఆ బాధ నుంచి బయటపడటానికి మళ్లీ వాళ్ల గురించే ఆలోచిస్తాం. అలా ఒక లూప్ తయారవుతుంది.
రోజులు గడుస్తాయి. పని ముందుంటుంది. కలలు ముందున్నాయి. మనలో ప్రతిభ ఉంటుంది కానీ మనసు మాత్రం వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది. అక్కడే మనం ఆగి ఒక ప్రశ్న అడగాలి. మనకు వాళ్లు కావాలా? లేదా వారితో ఉన్నప్పుడు మనకు కలిగిన ఆ అనుభూతి కావాలా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు ఒకటే కావాల్సిన అవసరం లేదు. అందుకే ప్రేమను వదిలిపెట్టడం అంటే ఆ ప్రేమ అబద్ధమని చెప్పడం కాదు. అది నిజమే. ఆ రోజులు నిజమే. ఆ సంతోషం నిజమే. ఆ అనుబంధం కూడా నిజమే. కానీ నిజమైన ప్రతి విషయం మన జీవితాంతం మనతో ఉండాల్సిన అవసరం లేదు. కొందరు మనుషులు మన జీవితాన్ని మార్చడానికి వస్తారు. మనతో జీవితాంతం ఉండడానికి మాత్రం రారు. అది అంగీకరించిన రోజే మనసు మెల్లగా తన దృష్టిని మార్చుకుంటుంది. ఇంతకాలం వాళ్లు ఏం చేస్తున్నారో చూసిన మనసు… ఇప్పుడు నేను ఏం చేయాలని అడగడం మొదలుపెడుతుంది.
ఇంతకాలం వాళ్లు తిరిగి వస్తారా అని ఎదురుచూసిన మనసు… ఇప్పుడు నా జీవితం ఎటు వెళ్లాలి అని ఆలోచిస్తుంది. అక్కడినుంచి చిన్న చిన్న విషయాలు తిరిగి వస్తాయి. ఎప్పుడో వదిలేసిన పని.. ఎప్పుడో పక్కన పెట్టిన కల. తనలోనే దాచుకున్న ప్రతిభ. ఎవరూ మెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చేయాలనిపించే పని. మళ్లీ తన కోసం జీవించాలనిపించే ఉదయం. అది పెద్ద మార్పులా కనిపించదు కానీ అదే అసలు మార్పు.
తాజావార్తలు
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!