Arctic: ఆర్కిటిక్‌లో మంచు కరిగితే రూ.21లక్షల కోట్ల నష్టం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతి పగబడితే ఊహించని వినాశనం తప్పదు. మంచు ఖండంగా పిలిచే ఆర్కిటిక్ ప్రాంతం ఇప్పుడు మనిషి ఉనికికే సవాల్ విసురుతోంది. అక్కడి నేల కింద గడ్డకట్టుకుపోయిన మంచు పొరలు ప్రమాదకర స్థాయిలో కరుగుతున్నాయి. ఇది చూసేందుకు సాధారణంగా అనిపించినా.. దీని వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు నేలమట్టం కాబోతున్నాయి. అసలు ఈ మంచు కరగడం ఏంటి? దీనివల్ల బహుళ అంతస్తుల భవనాలు ఎందుకు కుప్పకూలుతాయి? ఈ మహా ముప్పును శాస్త్రవేత్తలు ఎలా పసిగట్టారు? చల్లటి మంచు వెనుక ఉన్న విషాదాన్ని మీరూ తెలుసుకోండి.
ఉత్తర అర్ధగోళంలో దాదాపు 24 శాతం భూభాగం శాశ్వతంగా మంచు కిందే ఉంటుంది. ఇలా కనీసం రెండేళ్ల పాటు ఘనీభవించిన స్థితిలో ఉండే నేలను ‘పెర్మాఫ్రాస్ట్’ అంటారు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ‘పెర్మాఫ్రాస్ట్’ అత్యంత వేగంగా కరిగిపోతోంది. ఈ శతాబ్దం మధ్య నాటికి ఆర్కిటిక్ ప్రాంతంలో పెర్మాఫ్రాస్ట్ కరగడం వల్ల విపరీతమైన మౌలిక సదుపాయాల నష్టం వాటిల్లనుంది. ఈ నష్టం విలువ ఏకంగా సుమారు 21 లక్షల 66 వేల కోట్ల రూపాయలు ఉంటుందని తాజా అధ్యయనం తేల్చింది. గతంలో జరిగిన అధ్యయనాలు ఈ నష్టాన్ని 9 లక్షల 13 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేయగా.. తాజా లెక్కలు దానికి రెట్టింపు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.
ఈ ముప్పు సైబీరియా ప్రాంత వాసులకు మరింత ఎక్కువగా పొంచి ఉంది. సహజ వనరుల వెలికితీత కోసం పాత సోవియట్ యూనియన్ కాలంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారు. ఆ భవనాల పునాదులు ఇప్పుడు ప్రమాదపు అంచున ఉన్నాయి. దశాబ్దాలుగా గడ్డకట్టి ఉన్న పెర్మాఫ్రాస్ట్ కరిగినప్పుడు అందులో నిక్షిప్తమై ఉన్న గ్రీన్ హౌస్ వాయువులు ఒక్కసారిగా బయటకు విడుదల అవుతాయి. అదే సమయంలో నేల నిర్మాణంలో వచ్చే ఊహించని మార్పులతో ఆ మంచుపై నిర్మించిన భవనాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఈ తీవ్రతను ప్రపంచం ముందు ఉంచింది.
Also Read
యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్… జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు… సుధీర్ఘమైన పరిశీలన , అధ్యయనం తర్వాత ఈ ముప్పును ప్రపంచం ముందుంచారు. గతంలో జరిగిన అధ్యయనాలు భవనాలను 2-డైమెన్షనల్ కోణంలో మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాయి. దీనివల్ల నష్టం అంచనా కచ్చితంగా రాలేదు. ఇప్పుడు భవనాలను త్రీ-డైమెన్షనల్ రూపంలో మ్యాపింగ్ చేసి ఈ ప్రమాదాన్ని మరింత స్పష్టంగా అంచనా వేశారు. సింగిల్ స్టోరీ భవనాలతో పోలిస్తే బహుళ అంతస్తుల భవనాలను తిరిగి నిర్మించడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కాబట్టే.. ఈ నష్టం అంచనా 21 లక్షల కోట్లకు పైగా దాటింది.
ఈ అంచనాను లెక్కించడానికి పరిశోధకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఉపగ్రహ చిత్రాలకు సంబంధించిన పది టెరాబైట్ల డేటాసెట్‌ను ఉపయోగించి భవనాలను గుర్తించేలా డీప్ లెర్నింగ్ మోడల్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. భవనాల ఎత్తును కచ్చితంగా కొలిచేందుకు ఆర్కిటిక్డెమ్ అనే మరో డేటాసెట్‌ను రంగంలోకి దించారు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్, గూగుల్ నిధులతో నడిచే సూపర్ కంప్యూటర్ల సాయంతో ఈ భారీ డేటాను విశ్లేషించడం విశేషం.
వాతావరణ మార్పులతో భవిష్యత్తులో స్థానిక ఆస్తులకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో తెలుసుకోవడానికి ఈ డేటా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. పెర్మాఫ్రాస్ట్ క్షీణత నష్టాన్ని అంచనా వేయడం ఆర్కిటిక్ స్థానిక ప్రభుత్వాల ముందస్తు ప్రణాళికలకు చాలా అవసరం. సాంకేతిక పరిజ్ఞానం లేని చిన్న కమ్యూనిటీలు ప్రమాదాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఈ అధ్యయనం మార్గనిర్దేశం చేస్తుంది. ఈ విలువైన డేటాను అంతర్జాతీయ సంస్థల సహకారంతో పెర్మాఫ్రాస్ట్ డిస్కవరీ గేట్‌వే ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం నివాస భవనాలపై దృష్టి పెట్టిన ఈ పరిశోధనను.. భవిష్యత్తులో ఆర్కిటిక్ పారిశ్రామిక రంగాలకు సైతం వర్తించేలా తీర్చిదిద్దనున్నారు.
- Tags
- Explainers in Telugu
తాజావార్తలు
-
Arctic: ఆర్కిటిక్‌లో మంచు కరిగితే రూ.21లక్షల కోట్ల నష్టం?
-
BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
-
Duleep Trophy Final: ఈస్ట్ జోన్ పెద్ద స్కెచ్చే.. 2 రోజులు ఎందుకు బ్యాటింగ్ చేసిందంటే?.. బీసీసీఐ డిక్లరేషన్ రూల్ ఇదే!
-
Explainer: చైనా యువతను AI నిండా ముంచిందా?
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!