Layoffs: జాబ్స్‌కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే ప్రమాదంలో ఉన్నారని అనుకోవచ్చు.. కాల్ సెంటర్లో పని చేస్తుంటే మీ ఉద్యోగానికి AI ముప్పు ఉందని భావించవచ్చు.. అయితే ఇప్పుడు పరిస్థితి అక్కడితో ఆగడంలేదు. ఎందుకంటే తాజా అధ్యయనం ప్రకారం AI ప్రభావం నుంచి ఎవరూ పూర్తిగా సురక్షితం కాదట. అవును…! చివరకు ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు కూడా సేఫ్ పొజిషన్లో లేరు.
కొన్ని సంవత్సరాల క్రితం AI గురించి మాట్లాడినప్పుడు చాలామంది ఇది కేవలం కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాలనే ప్రభావితం చేస్తుందని అనుకున్నారు. ముఖ్యంగా కోడింగ్, కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, అకౌంటింగ్ లాంటి పనులపై మాత్రమే దీని ప్రభావం ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు వస్తున్న నివేదికలు చూస్తే AI ప్రభావం ఊహించిన దానికంటే చాలా వేగంగా విస్తరిస్తోందని తెలుస్తోంది.
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
- Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్‌పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
2023లో ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో జనరేటివ్ AI 2032 నాటికి ప్రపంచంలోని 90శాతం ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది. అంటే అప్పట్లో నిపుణులు ఈ స్థాయి మార్పు రావడానికి దాదాపు 9 సంవత్సరాలు పడుతుందని భావించారు. కానీ ఇప్పుడు అదే కాగ్నిజెంట్ విడుదల చేసిన తాజా నివేదిక అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఎందుకంటే 2032 నాటికి జరుగుతుందనుకున్న మార్పులు మూడేళ్లలోపే కనిపించడం ప్రారంభమయ్యాయని ఆ సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోని 93శాతం ఉద్యోగాలు AI సామర్థ్యం కలిగిన ఉద్యోగాలుగా మారిపోయాయని నివేదిక చెబుతోంది. ఈ నివేదిక వెలువడుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో భారీ ఉద్యోగ కోతలు కూడా కొనసాగుతున్నాయి. మెటా, ఒరాకిల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. లేఆఫ్స్ డాట్ FYI అనే సంస్థ లెక్కల ప్రకారం 2026లో ఇప్పటివరకు లక్షా 15 వేల 907 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. 2025లో ఈ సంఖ్య లక్షా 24 వేల 636గా నమోదైంది. నిజానికి AI వల్ల ఎక్కువ ప్రమాదం సాఫ్ట్వేర్ ఉద్యోగులకే ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు.
కానీ కాగ్నిజెంట్ రీసెర్చ్ హెడ్ ఒల్లీ మాత్రం వేరే విషయం చెబుతున్నారు. ఆయన ప్రకారం ఎవరూ పూర్తిగా సేఫ్ కాదు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు లాంటి వృత్తులు కూడా భవిష్యత్తులో మారాల్సిందే అంటున్నారు. దీనికి ఆయన చెప్పిన ఉదాహరణ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఒక ఇంటి గోడపై తడి మచ్చ కనిపిస్తే ప్రస్తుతం ప్లంబర్ వచ్చి పరిశీలిస్తాడు.
కానీ రాబోయే రోజుల్లో మల్టీమోడల్ రీజనింగ్ AI ఏజెంట్లు ఆ తడి మచ్చను గుర్తించగలవు. అది పైపులో లీకేజ్ వల్ల వచ్చిందని అంచనా వేయగలవు. మరమ్మత్తు ప్రణాళికను సిద్ధం చేయగలవు. అవసరమైన విడిభాగాల జాబితాను తయారు చేయగలవు. చివరికి ఇన్వాయిస్ కూడా రూపొందించగలవు. అంటే పైపును బిగించడం మాత్రం ప్లంబర్ పని. కానీ సమస్యను గుర్తించడం నుంచి బిల్లు తయారు చేయడం వరకు అనేక పనుల్లో AI సహాయం చేసే అవకాశం ఉంది. అందుకే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు కూడా పూర్తిగా సురక్షితంగా ఉన్నామని అనుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
అయితే మరోవైపు ఈ ఏడాది మార్చిలో ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసిన ఒక అధ్యయనం మాత్రం కొంత భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ అధ్యయనం ప్రకారం ఇన్స్టాలేషన్, రిపేర్ వర్క్‌కు సంబంధించిన 22 రకాల వృత్తులు AI ప్రభావానికి తక్కువగా గురయ్యే అవకాశం ఉందని చెప్పింది. కానీ కాగ్నిజెంట్ నివేదిక మాత్రం AI ప్రభావం వేగం పెరుగుతోంది.
మనుషుల నుంచి AIవైపు కంపెనీలు అడుగులు:
2032 కోసం ఈ సంస్థ గతంలో అంచనా వేసిన దానికంటే ప్రస్తుతం ఉద్యోగాల్లో AI ఎక్స్పోజర్ స్కోర్లు 30 శాతం ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొదట ఏడాదికి 2 శాతం చొప్పున పెరుగుతుందని భావించిన AI ప్రభావం ఇప్పుడు ఏడాదికి 9 శాతం చొప్పున పెరుగుతోందని చెప్పింది. ఇది ఎంత పెద్ద మార్పో చెప్పడానికి మరో లెక్క కూడా ఉంది. ఒక్క అమెరికాలోనే మాత్రమే 427 లక్షల కోట్ల విలువైన శ్రమ మనుషుల నుంచి AI వ్యవస్థల వైపు మారే అవకాశం ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు 427 లక్షల కోట్ల రూపాయలకు సమానం. అయితే కథ మొత్తం నెగెటివ్ కాదు.
AI ఉద్యోగాలను తీసేస్తుందని ఒకవైపు భయాలు ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించే అవకాశం ఉందని కాగ్నిజెంట్ AI చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుశాంత్ చెబుతున్నారు. AI కారణంగా కొత్త వ్యాపార అవకాశాలు, కొత్త సేవలు, కొత్త మార్కెట్లు ఏర్పడతాయని, వాటితో పాటు కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అందుకోసం కంపెనీలు తమ పని విధానాలను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుందని సూచించారు.
ఇటు AI జాబ్స్‌ను పూర్తిగా మింగేస్తుందని గతంలో హెచ్చరించిన టెక్ దిగ్గజాల అభిప్రాయాలు కూడా క్రమంగా మారుతున్నాయి. ఓపెన్ AI సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడై లాంటివారు ఈ అంశంపై కొత్తగా మాట్లాడుతున్నారు. మరోవైపు ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ మాత్రం AI ఉద్యోగాలన్నింటినీ తీసేస్తుందనే ప్రచారాన్ని పూర్తిగా అర్థరహితమైన వాదనగా అభివర్ణించారు.
అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. AI విప్లవం ఇక భవిష్యత్తు కథ కాదు. అది ఇప్పటికే ప్రారంభమైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా, ఆఫీస్ ఉద్యోగి అయినా, ప్లంబర్ అయినా, ఎలక్ట్రీషియన్ అయినా… మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకునే వారే రాబోయే కాలంలో ముందంజలో ఉండబోతున్నారు.
- Tags
- AI
- Explainers in Telugu
- Jobs
తాజావార్తలు
-
Jananayagan : విజయ్ ‘జననాయకుడు’ ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి