NTV Telugu Site icon

Holidays: పాఠశాలలకు, కళాశాలలకు రెండు రోజులు సెలవులు.. కారణం ఇదీ..

Untitled 30

Untitled 30

Education: గత ఏడాది తో పోల్చుకుంటే. ఈ ఏడాది సెలవలు ఎక్కువగానే ఉన్నాయి. విధ్యార్థులకైనా ఉద్యోగులకైనా వారంలో ఒక రోజు సెలవు అనేది ఉంటుంది. ఉద్యోగులైతే వారాంతంల్లో ఒక్క రోజైనా విశ్రాంతి తీసుకోవాలని.. విద్యార్థులైతే స్నేహితులతో కలిసి ఆడుకోవాలని అనుకుంటుంటారు. కానీ గత ఏడాది పబ్లిక్ హాలిడేస్ దాదాపు ఆదివారం వచ్చాయి. దీనితో సెలవులు చాలా వరకు తగ్గాయి. కానీ ఈ సంవత్సరం సెలవులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే అక్టోబర్ ప్రారంభంలోనే వరుసగా రెండు రోజులు సెలవలు వచ్చాయి. వివరాలలోకి వెళ్తే.. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం వచ్చింది. అలానే 2 వ తేదీ గాంధీ జయంతి. ఈ కారణంగా రెండు రోజులు వరుసగా సెలవలు వచ్చాయి. ఇక ఐటీ ఉద్యోగులకైతే శనివారం కూడా సెలవు కనుక మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.

Read also:Wife Birthday: భర్తలు అలర్ట్‌.. భార్యల బర్త్‌ డే మర్చిపోతే జైలుకే..!

ఈ ఏడాది కురిసిన కుండపోత వర్షాల వల్ల పాఠశాలలకు , కాళాశాలలకు సెలవలు వచ్చాయి. అలానే దసరా సెలవలు కూడా భారీగానే ఇవ్వనున్నారు. దసరా సెలవలు తెలంగాణలో అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీలో అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. అయితే తల్లిదండ్రులు కచ్చితమైన సంచారం కోసం విద్యాసంస్థల యాజమాన్యాన్ని సంప్రదించాలి. ఇలా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సెలవలు ఎక్కువగానే ఉన్నాయి.

Show comments