TG CPGET-2025 PG Entrance Exams: వచ్చే నెల(ఆగస్టు) 4వ తేదీ నుంచి తెలంగాణలో పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో TG CPGET-2025 పరీక్షలు జరుగుతాయి. వివిధ PG కోర్సులు, డిప్లొమాలు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 44 సబ్జెక్టులకు ఆగస్టు 4 నుంచి ఆగస్టు 11, 2025 వరకు పరీక్షలు ఉంటాయి. హాల్ టిక్కెట్లు జూలై 31, 2025 నుంచి www.osmania.ac.in, https://cpget.tgche.ac.in లేదా www.ouadmissions.com వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా.. ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్‌లో నిర్వహిస్తారు. గేట్, జీప్యాట్‌లో అర్హత సాధించిన వారిని మొదట చేర్చుకొని.. ఖాళీగా ఉన్న సీట్లను పీజీఈసెట్‌లో సాధించిన ర్యాంక్, స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
READ MORE: Prakash Raj: ఐదు గంటల పాటు లోపల జరిగింది ఇదే.. ఈడీ విచారణపై స్పందించిన ప్రకాశ్‌రాజ్
