SAIL Recruitment :సెయిల్ లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం.. తాజాగా సెయిల్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. బొకారో స్టీల్ ప్లాంట్ లో మొత్తం 85 అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఉద్యోగాల పై ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల కేటాయింపుకు సంబంధించి అన్‌రిజర్వుడ్‌కు 35,ఎస్టీలకు 22,ఎస్సీలకు 10, ఓబీసీలకు 10, ఈడబ్ల్యూఎస్‌లకు 8 కేటాయించారు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
అర్హతలు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెట్రిక్యులేషన్ పాసై.. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఈఎస్‌ఎంలకు మూడేళ్లు, సెయిల్ ఉద్యోగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.. ఇకపోతే దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థుల ఎత్తు 155 సెం.మీ., బరువు 45 కేజీలు ఉండాలి. ఛాతీ 75 సెం.మీ. ఉండి, గాలి పీల్చినప్పుడు 79 సెం.మీ. వరకూ ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 143 సెం.మీ. ఉండి, బరువు 35 కేజీలు ఉండాలి. అభ్యర్థులకు కంటి చూపు లోపాలు ఉండరాదు..
అప్లికేషన్ ఫీజు..
అప్లికేషన్ ఫీజుకు సంబంధించి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.100. చెల్లించాల్సి ఉంటుంది..
ఎంపిక విధానం..
అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తారు.. రాత పరీక్షలో అర్హత సాధించినవారిని స్కిల్/ ట్రేడ్ టెస్ట్‌కు ఎంపిక చేయబడతారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల శిక్షణ, ఏడాది ప్రొబేషన్ పిరియడ్ కూడా ఉంటుంది..
జీతం విషయానికొస్తే.. మొదటి ఏడాది శిక్షణ సమయంలో నెలకు రూ.12,900 చెల్లిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.15,000 చెల్లిస్తారు. శిక్షణ కాలం విజయవంతంగా పూర్తిచేసిన వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తారు. అప్పుడు నెలకు రూ.25,070- రూ.35,070 వరకు జీతాన్ని ఇస్తారు.. ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే వాళ్లు దరఖాస్తులను అన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25 నవంబర్ గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ ; http://www.sailcareers.com/ పరిశీలించగలరు…
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..