NTV Telugu Site icon

RRB ALP Recruitment 2024: రైల్వేలో భారీ రిక్రూట్మెంట్.. 5 వేలకు పై ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Railway Indian

Railway Indian

రైల్వేలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా 5 వేలకు పై ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ లను భర్తీ చేయడానికి ఆర్ ఆర్ బీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్ ఆర్ బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జనవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్ట్ లకు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత సాధించి ఉండాలి. దాంతో పాటు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ ట్రేడ్‌లలో గుర్తింపు పొందిన ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ సంస్థల నుండి ఐటిఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్ తో పాటు డిటైల్డ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ట్రేడ్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి..

అలాగే.. మెట్రిక్యులేషన్ తో పాటు మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసినవారు కూడా ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి అర్హులే. వారు మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి..

వయోపరిమితి..

ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. పూర్తి వివరాలకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ జనవరి 20-26 ఎడిషన్‌లో ప్రచురించే సమగ్ర నోటిఫికేషన్‌ ను పరిశీలించండి.. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం కొరకు అభ్యర్థులు RRBల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు…