నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు. జనరల్ మేనేజర్/ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.. ఈ ఉద్యోగాల పై అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అర్హతలు..
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి CA, MBA, CFA పూర్తి చేసి ఉండాలి..
వయసు..
అభ్యర్థుల వయస్సు నవంబర్ 1, 2023 నాటికి 38 సంవత్సరాల కంటే తక్కువ, 55 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది..
జీతం…
నెలకు రూ. 3,27,000- రూ. 3,70,000
ఉద్యోగము చేయవలసిన ప్రదేశము..
న్యూఢిల్లీ
అప్లికేషన్ ఫీజు..
SC/ST/PWD అభ్యర్థులు: రూ.150/-
మిగతా అభ్యర్థులందరూ: రూ.750/- ఈ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి..
ఎంపిక ప్రక్రియ..
ఆన్‌లైన్ పరీక్ష,అసెస్ మెంట్,గ్రూప్ డిస్కషన్,ఇంటర్వ్యూ
ఎలా అప్లై చేసుకోవాలంటే?
*.అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
*. దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రారంభ తేదీ: 15/12/2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: జనవరి 4, 2024.. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం అధికార వెబ్ సైట్ ను సందర్శించగలరు..