NTV Telugu Site icon

NLC Recruitment 2023 : ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ లో 295 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Jobs

Jobs

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.. ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కడలూరులో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 295 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.. పూర్తి వివరాలు..

మొత్తం ఖాళీలు: 295

గ్రాడ్యుయేట్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైయినీ పోస్టులు

రీన్యూయబల్ ఎనర్జి(ఏరియా-1): 140 ఖాళీలు

మెకానికల్‌: 36

సివిల్: 15

కంప్యూటర్‌: 18

ఎలక్ట్రికల్‌: 71

మైన్స్ & అల్లైడ్ సర్వీసెస్(ఏరియా-2): 155 ఖాళీలు

సివిల్: 13

మైనింగ్‌: 17

మెకానికల్‌: 84

ఎలక్ట్రికల్‌: 38

కంప్యూటర్‌: 03

అర్హతలు..

సివిల్ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో సివిల్ ఇంజినీరింగ్/సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు కలిగి ఉండాలి.

అదే విధంగా ఎలక్ట్రికల్‌ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/పవర్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు సాధించి ఉండాలి..

మెకానికల్‌ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్ధులు కనీసం 60శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్/మెకానికల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు సాధించాలి..

కంప్యూటర్‌ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు కలిగి ఉండాలి..

మైనింగ్‌ ; జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు కనీసం 60శాతం ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ తో గేట్ లో స్కోరే పరిగణలోకి తీసుకుంటారు..

వయోపరిమితి..

జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 35 సంవత్సరాలు మించరాదు..

అప్లికేషన్ ఫీజు..

జనరల్,ఈడబ్ల్యూఎస్, ఓబీసీ దరఖాస్తు ఫీజు రూ.500 దీంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.354 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.354 తగ్గింపు ఉంటుంది..

జీతం..

నెలకు రూ.50,000-రూ.1,60,000 చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 21.12.2023..

ఇంటర్వ్యూ ప్రక్రియ..

గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు..

ఈ ఉద్యోగాలకు సంబందించిన మరింత సమాచారం కోసం పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nlcindia.in/ పరిశీలించగలరు..