Site icon NTV Telugu

NCL Recruitment 2023: ఎన్‌సీఎల్, సింగ్రౌలీలో భారీగా ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?

Jobs

Jobs

కేంద్ర ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఈ క్రమంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్‌సీఎల్, సింగ్రౌలీలో పలు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. మొత్తం ఇందులో 21 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, ఆసక్తి కలిగిన వారు వీటిని అప్లై చేసుకోవచ్చు.. అభ్యర్థులు nclcil.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి మరియు అందించిన మార్గదర్శకాల ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

మొత్తం పోస్టుల వివరాలు..

స్టాఫ్‌ నర్స్‌-10,
ఫార్మసిస్ట్‌-07,
ల్యాబ్‌ టెక్నీషియన్‌-04..

అర్హతలు..

పోస్టును అనుసరించి బీఎస్సీ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణులై ఉండాలి..

వయసు..

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకొనేవారికి వయస్సు 65 ఏళ్లు మించకూడదు..

దరఖాస్తులకు చివరితేది: 30.11.2023.. అంటే ఈరోజే సాయంత్రం 5 లోపు ఈ అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు..

వెబ్‌సైట్‌: https://www.nclcil.in

ఎలా అప్లై చేసుకోవాలంటే?

*. nclcil.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి .
హోమ్‌పేజీలో, “రిక్రూట్‌మెంట్” ట్యాబ్ కోసం చూడండి.
*. “రిక్రూట్‌మెంట్” విభాగం కింద, “అప్రెంటిస్‌ల శిక్షణ”పై క్లిక్ చేయండి.
*. అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
*. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత, దానిని ఆన్‌లైన్‌లో సమర్పించండి.
*. మీ భవిష్యత్ సూచన కోసం సమర్పించిన అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోవాలని నిర్ధారించుకోండి..

Exit mobile version